వారణాసి నేపథ్యంలో ప్రేమకథ

ఎప్పడో పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో చూసాం..వారణాసి నేపథ్యంలో ప్రేమకథను. మళ్లీ మరోసారి వారణాసి బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇటీవల సాక్ష్యం, గూఢచారి సినిమాలు అందించిన అభిషేక్ పిక్చర్స్…

ఎప్పడో పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో చూసాం..వారణాసి నేపథ్యంలో ప్రేమకథను. మళ్లీ మరోసారి వారణాసి బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇటీవల సాక్ష్యం, గూఢచారి సినిమాలు అందించిన అభిషేక్ పిక్చర్స్ ఓ సినిమాను పూర్తిగా వారణాసి బ్యాక్ డ్రాప్ లో నిర్మించబోతోందట. ప్రవీణ్ కుమార్ అనే దర్శకుడు చెప్పిన ప్రేమకథ కోసం పాపులర్ యంగ్ హీరో కోసం ట్రయ్ చేస్తున్నారట. ఓకె కాగనే ప్రాజెక్ట్ డిటైల్స్ అనౌన్స్ చేస్తారు.

ఇంతకీ ఈ ప్రవీణ్ కుమార్ ఎవరోకాదు. గతంలో గాయం 2, కాళీచరణ్ అనే సినిమాలు అందించిన దర్శకుడే. ఈ కథ, పాయింట్ బాగుండడంతో అవకాశం ఇస్తున్నారట. వాస్తవానికి వారణాసి లాంటి లోకేషన్ చాలా బాగుంటుంది. ఆ అట్మాస్ఫియర్, లుక్ అంతా డిఫరెంట్ గా వుంటుంది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అంటే కాస్త బాగానే వుంటుంది.

అయినా ముందు విషయం బాగుండాలి. ఆపై డైరక్టర్ స్టామినా వుండాలి. అప్పుడు ఏ లొకేషన్ అయినా సూపరే. అన్నట్లు సాక్ష్యం సినిమాలో అన్నింటికన్నా వారణాసి లోకేషన్ లో తీసిన సీన్ నే హైలైట్ అయింది. ఆ సినిమాకు అదే సమస్య. విషయం బాగుంది. దాన్ని డీల్ చేసే స్టామినా డైరక్టర్ కు కరువైంది. ఈసారి అయినా అభిషేక్ నామా ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.