తాప్సీకి కోటిన్నర.. ఆదికి కోటి

సాధారణంగా మన సినిమాల్లో హీరోలకు పెద్ద రెమ్యూనిరేషన్లు, హీరోయిన్లకు తక్కువ రెమ్యూనిరేషన్లు వుంటాయి. పెద్ద హీరోలకు రెండు అంకెల్లో వుంటే, హీరోయిన్లకు ఒక అంకెలో వుంటాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద హీరోయిన్లను…

సాధారణంగా మన సినిమాల్లో హీరోలకు పెద్ద రెమ్యూనిరేషన్లు, హీరోయిన్లకు తక్కువ రెమ్యూనిరేషన్లు వుంటాయి. పెద్ద హీరోలకు రెండు అంకెల్లో వుంటే, హీరోయిన్లకు ఒక అంకెలో వుంటాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద హీరోయిన్లను తీసుకున్నపుడు, నామినల్ గా ఎవరినైనా హీరోగా తీసుకుంటారు. అప్పుడు లెక్క రివర్స్ అవుతుంది.

ఇలాకాకుండా హీరో, హీరోయిన్ ఇద్దరూ సమఉజ్జీలే అయినా, హీరోయిన్ రెమ్యూనిరేషన్ ఎక్కువ అంటే కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్ నే. ఈనెలలో విడుదలవుతున్న నీవేవరో సినిమాలో తాప్సీ, ఆది పినిశెట్టి హీరో హీరోయిన్లు. ఇద్దరి రేంజ్ దాదాపు ఒకటే అనుకోవాలి. ఆ మాటకు వస్తే, తెలుగులో ఈ మధ్య ఆది పినిశెట్టినే ఎక్కువ కనిపిస్తున్నాడు.

కానీ నీవెవరో సినిమా కోసం ఆది పినిశెట్టికి కోటి రూపాయలు, తాప్సీకి కోటిన్నర రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు బోగట్టా. దీనికి కారణం మరేంలేదు. మామూలుగా అయితే ఇలాంటి జోనర్ తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్, డిజిటల్, రీమేక్ రైట్స్ కోటిన్నర వరకు వస్తాయి. కానీ తాప్సీ వుంటే మూడుకోట్లు వరకు పలుకుతాయట. ఈ సినిమాకు అలాగే వచ్చాయి కూడా. అంటే తాప్సీ రెమ్యూనిరేషన్ వెనక్కు వచ్చేసినట్లే.

అందుకే తాప్సీకి అంత రెమ్యూనిరేషన్ అన్నమాట. ఆది పినిశెట్టి ఇప్పుడిప్పుడే తెలుగులో షైన్ అవుతున్నాడు కనుక కోటి రూపాయిలు. మరో రెండు మూడు హిట్ లు పడితే అతగాడి రెమ్యూనిరేషన్ కూడా రైజ్ అవుతుంది. డిమాండ్, సప్లయ్, మార్కెట్ బట్టే కదా ఏదయినా?