చి.ల.సౌ విడుదలకు ముందే రాహుల్ రవీంద్రన్ ను నాగార్జున లాక్ చేశాడు. దర్శకుడిగా అతడు తన నెక్ట్స్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై చేస్తాడని ప్రకటించాడు. రాహుల్ తన నెక్ట్స్ సినిమాను నాగార్జునతో చేస్తాడా లేక అఖిల్, నాగచైతన్యలో ఒకర్ని సెలక్ట్ చేసుకుంటాడా అనేది ఇక్కడ మేటర్ కాదు. అసలు రాహుల్ రవీంద్రన్, అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి బయటకు రాగలడా అనేది సమస్య.
చాన్నాళ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో చక్కర్లుకొట్టాడు కల్యాణ్ కృష్ణ. కానీ ఇప్పటివరకు బంగార్రాజు ప్రాజెక్టును ఓకే చేయించుకోలేకపోయాడు. ఈ గ్యాప్ లో నేలటిక్కెట్టు అనే మరో సినిమా కూడా చేశాడు. ఇక రాహుల్ రవీంద్రన్ టైపులోనే విక్రమ్ కుమార్ పై కూడా కర్చీఫ్ వేశాడు నాగ్. నాగచైతన్యతో సినిమా ఉంటుందని ప్రకటించాడు. అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు.
ఇలాంటి టైమ్ లో రాహుల్ రవీంద్రన్, తన నెక్ట్స్ ప్రాజెక్టుతో అక్కినేని హీరోల్ని వీలైనంత త్వరగా మెప్పించాలి. లేదంటే కల్యాణ కృష్ణ, విక్రమ్ కుమార్ లా లాంగ్ వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే, ఇంతా చేసి సినిమా ఫ్లాప్ అయితే వీరభద్రమ్ చౌదరి టైపులో రాహుల్ ను కూడా బద్నామ్ చేసే అవకాశం లేకపోలేదు.
రాహుల్ మాత్రం తన వద్ద రెండు స్టోరీలైన్స్ ఉన్నాయని చెబుతున్నాడు. భార్య చిన్మయితో డిస్కస్ చేసి వాటిలోంచి ఓ స్టోరీని పిక్ చేసుకుంటానని, దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలిచిన తర్వాత నాగార్జునను కలుస్తానని అంటున్నాడు.