పెద్ద బ్యానర్ ను పట్టేసాడు

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కొత్త కుర్రాడు కార్తికేయ. ఇప్పుడు మంచి అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. తమిళ నిర్మాత కలైపులి థాను తమ వి క్రియేషన్స్ బ్యానర్ పై కార్తికేయతో…

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కొత్త కుర్రాడు కార్తికేయ. ఇప్పుడు మంచి అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. తమిళ నిర్మాత కలైపులి థాను తమ వి క్రియేషన్స్ బ్యానర్ పై కార్తికేయతో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదిరిపోయింది. తమిళనాట కాస్త ఆసక్తికరమైన డిఫరెంట్ సినిమాలు చేసే కృష్ణన్ కే టి దర్వకత్వంలో ఈ సినిమా వుంటుందట.

ఈ కృష్ణన్ చేసిన ఓ సినిమా గతంలో తెలుగులోకి వచ్చింది.. నువ్వు, నేను, ప్రమ అనే పేరుతో. అతగాడి సినిమాలు అన్నీ కాస్త వైవిధ్యంగా వుంటాయి. బహుశా అందుకే కార్తికేయను కూడా తీసుకుని వుండొచ్చు. ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతికి చాన్స్ లు రావడం విశేషంకాదు. ఎందుకంటే రెండున్నర కోట్లలో ఆ రేంజ్ అవుట్ పుట్, ఆ రేంజ్ లాభాలు ఇచ్చారు కాబట్టి అందరూ సై అంటారు.

కానీ స్వంతంగా సినిమా తీసుకున్న హీరోను యాక్సెప్ట్ చేసి చాన్స్ ఇవ్వడం అంటే వేరు. పోనీ మనదగ్గరే వేరే నిర్మాత అంటే తెరవెనుక పెట్టుబడి అనే అవకాశం వుంది. కానీ థాను లాంటి నిర్మాత, కృష్ణలాంటి డైరక్టర్ ను తీసుకుని వచ్చారు అంటే కుర్రాడికి కాస్త గుర్తింపు వచ్చినట్లే అనుకోవాలి.