అఖిల్ గత చిత్రం 'హలో' బాగుందనే టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమా కంటే అఖిల్ అన్నిటా ఇంప్రూవ్ అయ్యాడనే ప్రశంసలు దక్కాయి. కానీ హలోకి పోటీగా వచ్చిన ఎంసిఏ చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కడంతో అఖిల్ చిత్రం నిలబడలేకపోయింది. ఎంసిఏ విజయంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించిందనే సంగతి తెలిసిందే.
ఫిదా తర్వాత సాయి పల్లవి మాయలో వున్న యువత ఆ చిత్రానికి ఘనమైన ఓపెనింగ్స్ ఇచ్చారు. క్రిస్మస్ సెలవుల్లో ఎంసిఏదే పైచేయి కావడంతో హలో చిత్రంతో నాగార్జునకి నష్టాలు తప్పలేదు. తన మూడవ చిత్రాన్ని 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తోన్న అఖిల్ మరోసారి డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్‌నే ప్లాన్ చేసుకుంటున్నాడు.
నాగార్జునకి బాగా కలిసి వచ్చిన సీజన్ కావడంతో, హలో మిస్‌ఫైర్ అయినా కానీ అదే టైమ్‌కి అఖిల్ మూడవ చిత్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. కాకపోతే మరోసారి అఖిల్‌కి సాయి పల్లవి సినిమా నుంచి పోటీ తప్పేట్టు లేదు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న 'పడి పడి లేచె మనసు' చిత్రాన్ని అదే వారంలో విడుదల చేయబోతున్నారు. ఈసారి కూడా సాయి పల్లవి ఫ్యాక్టర్ పని చేసి యువత 'పడి పడి' చూసేస్తే కనుక అఖిల్ చిత్రానికి టఫ్ కాంపిటీషన్ తప్పదు.