సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్‌కి ఇప్పటికీ సోలో హీరోలుగా మార్కెట్ బాగున్నప్పటికీ తమ ఏజ్‌కి తగ్గ కథలు రావడం తగ్గిపోవడంతో ఇద్దరూ స్టయిల్ మార్చేసారు. సోలోగానే నటిస్తామంటూ నాసి రకం సినిమాలు చేసేకంటే యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ చేయడం ఉత్తమమని డిసైడ్ అయ్యారు.
నాగార్జున, నాని కలిసి 'దేవదాస్' చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే హిందీ, తమిళంలో కూడా సహాయ పాత్రలు చేయడానికి నాగార్జున అంగీకరించారు. వెంకటేష్ కూడా వరుణ్ తేజ్‌తో ఒకటి, నాగచైతన్యతో ఒకటి చేస్తున్నారు. ఏజ్‌కి తగ్గ పాత్రలు వస్తే ఇప్పటికీ బ్లాక్బస్టర్లు ఇవ్వడం వీరికి కష్టమేం కాదు కానీ అలాంటి కథలు చాలా అరుదు కనుక ఖాళీగా వుండడం కంటే కాంబినేషన్ సినిమాలు చేయాలని వీరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు.
వీరి సమకాలీకులు అయిన చిరంజీవి, బాలకృష్ణ మాత్రం ఇంకా సోలోగానే నటిస్తున్నారు. ప్రస్తుతానికి పెద్ద తరహా లీడ్ క్యారెక్టర్లని మాత్రం పిక్ చేసుకుంటోన్న చిరంజీవి, బాలయ్య కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలో యువ హీరోలతో కలిసి నటించడానికి సిద్ధపడవచ్చు.