హిందీ ‘అర్జున్ రెడ్డి’ పేరు అదే!

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిందీ రీమేక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నదని దాని రూపకర్తలు ప్రకటించారు. విడుదల తేదీని కూడా వారు అనౌన్స్ చేశారు. 2019 జూన్ 21వ…

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిందీ రీమేక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నదని దాని రూపకర్తలు ప్రకటించారు. విడుదల తేదీని కూడా వారు అనౌన్స్ చేశారు. 2019 జూన్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. వచ్చే ఏడాదిలో అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ విడుదల కానుంది.

ఒరిజినల్‌ను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌ను కూడా రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. హిందీలో కూడా ఈ సినిమా టైటిల్ ‘అర్జున్ రెడ్డి’ అనే పెడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల గురించి రూపకర్తలు పోస్టు చేసిన ట్వీట్లో ‘షాహిద్ కపూర్ స్టారర్ అర్జున్ రెడ్డి’ అని పేర్కొన్నారు.

దీన్నిబట్టి ఈ సినిమా హిందీ వెర్షన్ టైటిల్ కూడా ‘అర్జున్ రెడ్డి’ అనే అనుకోవాలి. తమిళంలో ఈ సినిమాను ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మాత్రం ఇలాంటి మార్పేమీ లేకుండా సెంటిమెంటల్‌గా, టైటిల్‌ జనాలకు బాగా రీచ్ అయిన తీరుతో తెలుగు టైటిల్‌నే వాడుతున్నట్టుగా ఉన్నారు. అలాగే తెలుగు వెర్షన్ తీసిన సందీపే హిందీ వెర్షన్‌ కూడా తీస్తున్నాడు కాబట్టి.. టైటిల్‌లో మార్పు జరిగినట్టుగా లేదు.