ఇక ఆ సినిమాను వదిలేది ఎప్పుడో?

జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సినిమాలు ఫుంఖాను పుంఖాలుగా విడుదలయ్యాయి. ఆగస్టు పరిస్థితి కూడా అలాగే వుంది. అలాంటి ఒక సినిమా మాత్రం చడీ చప్పుడు లేకుండా అలా వుంది. అలా అని పూర్తికాలేదా…

జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సినిమాలు ఫుంఖాను పుంఖాలుగా విడుదలయ్యాయి. ఆగస్టు పరిస్థితి కూడా అలాగే వుంది. అలాంటి ఒక సినిమా మాత్రం చడీ చప్పుడు లేకుండా అలా వుంది. అలా అని పూర్తికాలేదా అంటే ఎప్పడో పూర్తయింది. టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ సినిమాకు బజ్ రాలేదు. టైటిల్ కు బజ్ రాలేదు. దానికితోడు సినిమాను అలా వెనక్కు వుంచేసారు.

హీరోగా సునీల్ కు బహుశా లాస్ట్ సినిమా అనుకోవచ్చేమో? ఎందుకంటే ఆయన కమెడియన్ గా మారారు మళ్లీ. ఇక హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ మరో హీరో. ఈ ఇద్దరు నటించిన సిల్లీ ఫెలోస్ సినిమా సంగతే ఇది. తమిళ సినిమా రీమేక్ గా దర్శకుడు భీమినేని చేసిన సినిమా ఇది. ఇన్ని సినిమాలకు డేట్ లు సెట్ అయినా సిల్లీ ఫెలోస్ కు మాత్రం డేట్ పడలేదు ఎందుకునో?

ఇప్పటికే మార్చి 9, 15, 24, 31 బుక్ అయిపోయాయి. ఒక్కో సినిమా రెడీగా వుంది. మరి సోలో డేట్ కోసం చూస్తున్నారేమో తెలియదు. సెప్టెంబర్ లో కూడా ఇప్పటి మూడు సినిమాలు డేట్ లు ఫిక్స్ చేసుకుని వున్నాయి. అక్టోబర్, నవంబర్ భారీ సినిమాల సంగతి తెలిసిందే. మరి సిల్లీ ఫెలోస్ ఆలోచన ఏమిటో?