రొటీన్ కథ.. స్క్రీన్ ప్లే పైనే భారమంతా..!

గీతగోవిందం సినిమాపై ప్రస్తుతం చాలా బజ్ నడుస్తోంది. ఈ సినిమాపై జనాల్లో ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ చాలా కొద్దిమందికే తెలిసిన విషయం ఒకటుంది. అదేంటంటే ఇది చాలా రొటీన్ కథ.…

గీతగోవిందం సినిమాపై ప్రస్తుతం చాలా బజ్ నడుస్తోంది. ఈ సినిమాపై జనాల్లో ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ చాలా కొద్దిమందికే తెలిసిన విషయం ఒకటుంది. అదేంటంటే ఇది చాలా రొటీన్ కథ. కేవలం స్క్రీన్ ప్లేపై ఆధారపడి తీసిన సినిమా. స్క్రీన్ ప్లే వర్కవుట్ అయితేనే సినిమా క్లిక్ అవుతుందన్నమాట.

ఇంతకీ కథేంటంటే, గతంలోనే ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టు హీరో చేసిన పనుల వల్ల అతడిపై హీరోయిన్ కు నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మరోవైపు హీరో మాత్రం హీరోయిన్ ను ప్రేమిస్తుంటాడు. ఒకదశలో అనుకోకుండా హీరోయిన్ ను ముద్దాడతాడు హీరో. ఆ సీన్ ను టీజర్ లో కూడా చూపించారు. ఆ తర్వాత అనుకోకుండా 2 కుటుంబాలు కలవడం, హీరోను హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

ఇక అక్కడ్నుంచి మళ్లీ మన పాత సినిమాల్లో చూసినట్టు హీరో చేసిన పనులు హీరోయిన్ కు నచ్చుతాయి. అప్పట్నుంచి అతడ్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్లైమాక్స్ సంగతి అందరికీ తెలిసిందే. సో.. ఇదంతా ఫక్తు తెలుగు సినిమా ఫార్మాట్ లో పద్ధతి ప్రకారం సాగిపోతుంది. ఇలాంటి కథను మంచి సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ తో ఎంత బాగా ప్రజెంట్ చేశామనేదే ఇంపార్టెంట్.

ప్రస్తుతం యూనిట్ మొత్తం ఈ యాంగిల్ లోనే ఆశలు పెట్టుకుంది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు సినిమా కథ మొత్తం ఓ ఫ్లోలో సాగిపోతుందని అంటున్నారు. పరశురాం డైరక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలకానుంది.