కాపులు గతం మరచిపోయారా?

ఇప్పుడు తెలుగుదేశం అను'కుల' మీడియా గోల అంతా ఒక్కటే. జగన్ యూటర్న్ తీసుకున్నారు. అందువల్ల కాపులు ఇక ఆయన మొహం చూడరు. ఆయన పార్టీకి ఓట్లేయరు. ఇదే హడావుడి. సరే నిజమే అనుకుందాం. Advertisement…

ఇప్పుడు తెలుగుదేశం అను'కుల' మీడియా గోల అంతా ఒక్కటే. జగన్ యూటర్న్ తీసుకున్నారు. అందువల్ల కాపులు ఇక ఆయన మొహం చూడరు. ఆయన పార్టీకి ఓట్లేయరు. ఇదే హడావుడి. సరే నిజమే అనుకుందాం.

మరి తెలుగుదేశం పార్టీకి కాపులు ఓట్లు వేస్తారా?
ఎందుకంటే ఆ పార్టీ హయాంలోనే, ఆ పార్టీ అధికారంలో వుండగానే.. కాపు ఉద్యమనాయకుడు ముద్రగడను ఇంట్లో బంధించారు. రోజుల తరబడి. ఆయనను చూడడానికి ఎవరు వెళ్లినా రాజమండ్రి నుంచి వెనక్కుపంపారు. ముద్రగడ కొడుకును కొట్టారని ఆయనే చెప్పారు.

తుని సంఘటనను బయటకు తీసి, అనేకమంది కాపు యువకులపై కేసులు బనాయించారు. అరెస్ట్ లు సాగించారు. తెలుగుదేశం పార్టీ పునాదులు బీసీల్లోనే వున్నాయి. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని ఆ పార్టీ అనుకూల మీడియా వేన వేలసార్లు వార్తలు అందించింది.

మరి ఇవన్నీ కాపులు మరచిపోయారా? కేవలం జగన్ యూటర్న్ తీసుకున్నదే గుర్తు పెట్టుకున్నారా? పోనీ ఈ సంగతి అలా వుంచితే, చంద్రబాబు కాపు రిజర్వేషన్లు సాధించగలరు అని నమ్ముతున్నారా? అదికూడా లేదు. కానీ  ఆ విషయంపై మీడియా హంగామా చేస్తుందా? చేయదు కదా?

అంతెందుకు? ఉత్తరాంధ్ర తెలుగుదేశంలో రాజకీయంగా వెలమలది ఆధిపత్యం వుందా? కాపులకు ఆధిపత్యం వుందా? గంటాను పక్కన పెడుతున్నారా? అయ్యన్ననా? నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో మిగిలిన నాయకులు అందరూ కలిసి కళా వెంకటరావును ఎందుకు టార్గెట్ చేసారు?

మన మీడియాకు అంటే జగన్ యూటర్న్ తప్ప వేరేది గుర్తుండదు. కాపులు కూడా అంతేనా?