మహానటి తరువాత శ్రీనివాస కళ్యాణం

మహానటి సినిమా విడుదలయి మూడునెలలు కావస్తోంది. ఈలోగా చాలా సినిమాలు విడుదలయ్యాయి.  దాదాపు పాతిక సినిమాలు పైగానే విడుదలయి వుంటాయి. బావున్నవీ వున్నాయి..బాగాలేనివీ వున్నాయి..కానీ మహిళలను ఇంట్లోంచి థియేటర్లలోకి రప్పించే సినిమా రాలేదు.  ఫ్యామిలీ…

మహానటి సినిమా విడుదలయి మూడునెలలు కావస్తోంది. ఈలోగా చాలా సినిమాలు విడుదలయ్యాయి.  దాదాపు పాతిక సినిమాలు పైగానే విడుదలయి వుంటాయి. బావున్నవీ వున్నాయి..బాగాలేనివీ వున్నాయి..కానీ మహిళలను ఇంట్లోంచి థియేటర్లలోకి రప్పించే సినిమా రాలేదు.  ఫ్యామిలీ సినిమాలు అయితే వచ్చాయి కానీ, ఫ్యామిలీలను లాక్కురాలేదు.

ఆఖరికి ఆగస్టు 9న వస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి.  పూర్తిగా పెళ్లిళ్లు, పెళ్లి తంతులు, మానవ సంబంధాలు ఇవన్నీ కలిపి సినిమాగా  మార్చారు. పైగా సినిమా అంతా మహిళలు, పట్టుచీరలు, నగలు, హడావుడి హంగామా కనిపిస్తోంది. సినిమా మేకింగ్ విడియో చూస్తుంటే కలర్ ఫుల్ గా ముచ్చటగా వుంది.

నితిన్..రాశీఖన్నా పెయిర్, దిల్ రాజు బ్యానర్, శతమానం భవతి కాంబినేషన్. ఇలా మొత్తం మీద చూస్తుంటే, మహానటి సినిమా తరువాత కచ్చితంగా మహిళలను ఇళ్లలోంచి బయటకు తీసుకువచ్చే సినిమా మళ్లీ ఇదే అవుతుందేమో ?  చూడాలి. ఫలితం ఎలావుంటుందో? సతీష్ వేగ్నిశ రెండో ప్రయత్నం, దిల్ రాజు ఆశలు ఏ మేరకు నెరవేరాయో?