మహేష్ – క్రికెట్ ఫైట్

కాలేజీ కుర్రాళ్లు అంటే గొడవలు కామన్. అందులో కాలేజీల్లో గొడవలు జరిగే పేస్ కూడా కామన్. అదే ప్లే గ్రవుండ్.  ఏ ఫైట్ అయినా, జరగాల్సిందే ప్లే గ్రవుండ్ లోనే. పాత గొడవలు కొత్తగా…

కాలేజీ కుర్రాళ్లు అంటే గొడవలు కామన్. అందులో కాలేజీల్లో గొడవలు జరిగే పేస్ కూడా కామన్. అదే ప్లే గ్రవుండ్.  ఏ ఫైట్ అయినా, జరగాల్సిందే ప్లే గ్రవుండ్ లోనే. పాత గొడవలు కొత్తగా రేగేదీ అక్కడే. అందుకే మహేష్ సినిమాలో కూడా ఇలాంటి పైట్ తప్పలేదు. క్రికెట్ ఆట సందర్భంగా బ్యాట్ లను బ్యాటింగ్ కోసం కాకుండా, ఫైటింగ్ కోసం వాడక తప్పలేదు.

ఇదంతా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ముచ్చట. ఈ సినిమాకు సంబంధించి గడచిన రెండు మూడు రోజులుగా ఓ ఫైట్ చిత్రకరించారు.  కాలేజీలో క్రికెట్ ఆట సందర్భంగా రెండు విద్యార్థి గ్రూప్ ల మధ్య వివాదం తలెత్తి, ఫైటింగ్ కు దారితీయడం, ఆ నేపథ్యంలో భారీ ఫైట్ అన్నమాట.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో  మహేష్ బాబు కొంత ఎపిసోడ్ లో స్టూడెంట్ గా కనిపిస్తాడు. ఆ  ఎపిసోడ్ లోనే ఈ ఫైట్ వస్తుంది.