హీరోకి దమ్ముంది.. సినిమాకు?

బెల్లంకొండ శ్రీనివాస్ ను పక్కా పద్దతిగా ప్లాన్ చేసుకుని 40కోట్ల మార్కెట్ వున్న హీరోగా తయారుచేసాడు తండ్రి సురేష్. సాక్ష్యం సినిమా ఒడిదుడుకుల్లో విడుదలయి, మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినా ఫస్ట్ డే మూడుకోట్లకు…

బెల్లంకొండ శ్రీనివాస్ ను పక్కా పద్దతిగా ప్లాన్ చేసుకుని 40కోట్ల మార్కెట్ వున్న హీరోగా తయారుచేసాడు తండ్రి సురేష్. సాక్ష్యం సినిమా ఒడిదుడుకుల్లో విడుదలయి, మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినా ఫస్ట్ డే మూడుకోట్లకు పైగా షేర్ సాధించడం అంటే మెచ్చుకోదగ్గదే. అదేసత్తా కనుక సినిమాలో కూడా వుండి వుంటే ఫస్ట్ వీకెండ్ తొమ్మిది నుంచి పదికోట్ల వరకు లాగేసే వీలు వుండేది. జయజానకీ నాయక సినిమా ఫస్ట్ వీకెండ్ లో తొమ్మిది కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ తెచ్చుకున్న విషయం ఇక్కడ గమనించాలి.

కానీ అలాంటి దమ్మున్న హీరోను దర్శకుడు శ్రీవాస్ చేతిలో పెట్టడం అన్నది తండ్రి బెల్లంకొండ సురేష్ చేసిన అతి పెద్ద తప్పిదంగా మిగిలిపోతుంది. అవసరం అయితే కోటికి బదులు రెండుకోట్లు ఇచ్చి అయినా కథ, లైన్ తీసేసుకుని, మళ్లీ ఏ బోయపాటి లాంటి డైరక్టర్ చేతిలో పెట్టి వుంటే సాక్ష్యం సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ భారీ కమర్షియల్ హీరో అనిపించుకునేవాడు. కానీ శ్రీవాస్ ఆ ఆశలన్నీ నీరుకార్చేసారు. సాక్ష్యం లాంటి భారీ కథను అల్లుకున్న ఆయనకు, ఆ సినిమాను అదే రేంజ్ లో తెరకెక్కించగల స్టామినా మాత్రం సరిపోలేదు.

దీంతో ఏమయింది. బి.సి సెంటర్లలో హీరోకు ఓపెనింగ్స్ తెచ్చుకోగల దమ్ము వుంది. కానీ సినిమాలో అది లేకపోయేసరికి, రన్నింగ్ ఎలా వుంటుంది? అన్నది ప్రశ్నార్థకమయింది. ఇకనైనా సరైన డైరక్టర్లతో చేయడం చాలా అవసరం. కథ తెచ్చిన ప్రతి ఒక్కరు సరైన డైరక్టర్ కావడం అన్నది కష్టం అని గమనించాలి.