శౌర్య సరసన ఈషా

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కాస్త గట్టిగానే వుంది. అందువల్లే ఒక్కసారి టేకాప్ అయిన హీరోయిన్లకు చాన్స్ ల మీద చాన్స్ లు వస్తున్నాయి. లేటెస్ట్ గా హీరోయిన్ ఈషారెబ్బా ఇలాంటి ఫేజ్…

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కాస్త గట్టిగానే వుంది. అందువల్లే ఒక్కసారి టేకాప్ అయిన హీరోయిన్లకు చాన్స్ ల మీద చాన్స్ లు వస్తున్నాయి. లేటెస్ట్ గా హీరోయిన్ ఈషారెబ్బా ఇలాంటి ఫేజ్ లోనే వున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కాస్త మాంచి రోల్, డ్యూయట్ కు సెలెక్ట్ అయింది. డైరక్టర్ మారుతి నిర్మించిన బ్రాండ్ బాలులో హీరోయిన్ ఆమెనే.

ఇప్పుడు మరో అవకాశం కూడా వచ్చేసింది. భవ్య క్రియేషన్స్ సంస్థ హీరో నాగశౌర్య సరసన నటించేందుకు ఈషాను ఓకె చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈషాను తీసుకోవడం అన్నది హీరోకి అంత పూర్తి సంతృప్తికరం కాకపోయినా, మరో చాయిస్ లేక ఓకె అనేసినట్లు తెలుస్తోంది. 

భవ్య నిర్మించే ఈ సినిమాకు కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటిదాకా కొత్త హీరోయిన్లతోనే చేస్తున్న నాగశౌర్య, ఈసారి కొన్ని సినిమాలు చేసిన మీడియం హీరోయిన్ ను ఎంచుకోవడం విశేషం.