అక్కినేని హీరోలు అందరూ ఫ్లాపుల్లో వున్నారు వాస్తవానికి. నాగార్జున ఆఫీసర్ పేరుతో భయంకరమైన డిజాస్టర్ చవి చూసాడు. అంతకన్నా ముందు నాగచైతన్య యుద్ధం శరణం పేరుతో మరో యాక్షన్ డిజాస్టర్ చవిచూసాడు. అఖిల్ హలో సంగతి చెప్పనక్కరలేదు.
ఇక అక్కినేని ఫ్యామిలీ మూలాలు వున్న సుమంత్ ఎప్పటి నుంచో హిట్ అంటే ఏమిటి? అన్నట్లు వున్నాడు. సుశాంత్ అయితే స్వంత నిర్మాణం బంద్ చేసి, సినిమాకు గ్యాప్ ఇచ్చేసాడు. అలాంటి టైమ్ లో మళ్లీ రావా సినిమాతో సుమంత్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు చేతిలో రెండు వైవిధ్యమైన సినిమాలు వున్నాయి. నాగచైతన్య కూడా శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి అంటూ రెండు ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు.
నాగార్జున మరో హీరో నానితో కలిసి దేవ్ దాస్ అనే మంచి సినిమా చేస్తున్నారు. ఇక అఖిల్ కూడా హిట్ డైరక్టర్ వెంకీ అట్లూరితో జతకట్టాడు. మిగిలింది సుశాంత్. అతగాడు ఓ చిన్న సినిమా చేసేసాడు. చి.ల.సౌ. ఈ సినిమాకు ఈ మధ్య భలే బజ్ వచ్చింది. నాగచైతన్య ఈ సినిమాను తీసుకుని, ఫినిష్ చేసి, మార్కెట్ లోకి తెస్తున్నాడు. ట్రయిలర్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు సుశాంత్ చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అండ్ పెర్ ఫార్మెన్స్ అన్నట్లు కనిపిస్తోంది.
ట్రయిలర్ కూడా ప్రామిసింగ్ గా వుంది. సో, ఇది కనుక హిట్ అయితే, సుశాంత్, సుమంత్ లైన్లో పడినట్లే. చూస్తుంటే అక్కినేని హీరోల టైమ్ స్టార్ట్ అయినట్లే వుంది.