‘గీత’ దాటుతోన్న హీరో!

విజయ్‌ దేవరకొండకి వచ్చిన రెబల్‌ ఇమేజ్‌ని అలాగే కొనసాగించడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి మాటలోను ఏదో వివాదం తలెత్తే విధంగా వ్యవహరించే విజయ్‌ తన తాజా చిత్రం 'గీత గోవిందం'ని కూడా…

విజయ్‌ దేవరకొండకి వచ్చిన రెబల్‌ ఇమేజ్‌ని అలాగే కొనసాగించడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి మాటలోను ఏదో వివాదం తలెత్తే విధంగా వ్యవహరించే విజయ్‌ తన తాజా చిత్రం 'గీత గోవిందం'ని కూడా సక్సెస్‌ఫుల్‌గా కాంట్రవర్సీ చేసేసాడు. క్లీన్‌ సినిమా అనే ఫీలింగ్‌ తెచ్చిన 'గీత గోవిందం'కి నెమ్మదిగా 'అర్జున్‌రెడ్డి' తరహా కలర్‌ ఇస్తున్నాడు.

మొదటి పాట 'ఇంకేం ఇంకేం కావాలే' ఎంతో శ్రావ్యంగా వుండి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అలాంటి క్లీన్‌ సాంగ్‌తో వచ్చిన హైప్‌ చాలదన్నట్టు రెండవ పాట 'వాట్‌ ది ఎఫ్‌'ని కాంట్రవర్షియల్‌ లిరిక్స్‌తో చాలా మందికి కోపమొచ్చేలా చేసి వార్తల్లోకెక్కారు. విజయ్‌ పాడిన ఈ పాట ఒక్క రోజయినా తిరగకుండానే యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ అయింది.

సీత, సావిత్రిలపై సెటైర్లు వేస్తూ రాసిన లిరిక్స్‌ చాలా మందిని నొప్పించాయి. ఇవి వివాదం కాగలవని అల్లు అరవింద్‌ లాంటి వాళ్లు కూడా ఊహించకపోవడం విచిత్రమే. తనకి యూత్‌లో వున్న 'రౌడీ' ఇమేజ్‌కి కొనసాగింపుగా ప్రతి సినిమా వుండాలని చూస్తోన్న విజయ్‌ దేవరకొండ తనకి తెలియకుండానే ఒక ఛట్రంలో పడిపోతున్నాడేమో అనే విమర్శలు వస్తున్నాయి.