వారం రోజుల ముందుగా శ్రీనివాసకళ్యాణం

నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. నితిన్-రాశీఖన్నాల ఈ సినిమా ఆగస్టు 9న విడుదలవుతుంది. అయితే ఆ డేట్ కు అయిదారు రోజులు ముందుగానే సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీలకు…

నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. నితిన్-రాశీఖన్నాల ఈ సినిమా ఆగస్టు 9న విడుదలవుతుంది. అయితే ఆ డేట్ కు అయిదారు రోజులు ముందుగానే సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీలకు స్పెషల్ షో వేయబోతున్నారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సహా వచ్చి సినిమా చూసేలా ఏర్పాట్లు చేయాలని నిర్మాత దిల్ రాజు తన యూనిట్ కు ఆదేశాలిచ్చేసారని తెలుస్తోంది.

యాక్ట్యువల్ గా దిల్ రాజు ఇలా చేయడం కొత్తకాదు. శతమానం భవతి సినిమాకు ఇలాగే చేసారు. విడుదలకు కొద్దిరోజులు ముందుగా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి కుటుంబాలను పిలిచి మరీ సినిమా చూపించారు. మళ్లీ అదే సెంటిమెంట్ ను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. 

విక్కీ జె మేయర్ అందించిన అడియో ఇటీవల విడదులయింది. ఎఫ్ఎమ్ ల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు ఓ భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. హీరో నితిన్ కు ఈ సినిమా మీద చాలా హోప్స్ వున్నాయి.