గ్యాప్ తీసుకోవాల్సిందే: హీరోల అంతర్మధనం

మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా కొంతమంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంటే.. దీనికి విరుద్ధంగా మరికొంతమంది హీరోలు గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. వరుసగా ఫ్లాపులు రావడం ఒకెత్తయితే, అనుకున్న…

మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా కొంతమంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంటే.. దీనికి విరుద్ధంగా మరికొంతమంది హీరోలు గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. వరుసగా ఫ్లాపులు రావడం ఒకెత్తయితే, అనుకున్న స్థాయిలో ఇమేజ్ బిల్డప్ కాకపోవడం మరో రీజన్. ఇలా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్న హీరోల జాబితాలోకి తాజాగా బన్నీ కూడా చేరాడు.

నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు బన్నీ. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొత్త కథ ఎంపికలో తడబడుతున్నాడు. కాస్త గ్యాప్ తీసుకొని తాజాగా మరోసారి కథలు వినడం స్టార్ట్ చేశాడు. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో, మరికొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు అల్లువారబ్బాయ్.

బన్నీతో పాటు మెగా కాంపౌండ్ కు చెందిన సాయిధరమ్ తేజ్ కూడా గ్యాప్ కే ఫిక్స్ అయ్యాడు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో తేజూ తన కొత్త సినిమాల్ని పెండింగ్ లో పెట్టాడు. ఈ గ్యాప్ లో ఊడిపోతున్న జుట్టును కాస్త సరిచేసుకోవాలని భావిస్తున్నాడు ఈ హీరో. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే కిషోర్ తిరుమల సినిమా స్టార్ట్ అవుతుంది.

మరో హీరో రాజ్ తరుణ్ కూడా ఈ ఏడాది ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టేశాడు. రీసెంట్ గా వచ్చిన లవర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరో కూడా గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, తిరుపతి వెళ్లి ఎంచక్కా గుండు కూడా కొట్టించుకున్నాడు. సో.. మళ్లీ కొత్తగా జుట్టు వచ్చేవరకు రాజ్ తరుణ్ సినిమాలు చేయడు.

ఈ లిస్ట్ లో ఆకాష్ పూరి కూడా ఉన్నాడు. మెహబూబా డిజాస్టర్ తర్వాత ఆకాష్ పూరి సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నిజానికి తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాను వెంటనే స్టార్ట్ చేయాలని అనుకున్నాడు ఆకాష్. కానీ మెహబూబా డిజాస్టర్ అవ్వడం, పూరి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆకాష్ కు గ్యాప్ తప్పలేదు.

ఇక ఈ లిస్ట్ లో ఎప్పట్నుంచో కొనసాగుతున్నారు మంచు సోదరులు. మంచువిష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ విజయాలందుకొని చాన్నాళ్లయింది. రీసెంట్ గా విష్ణు చేసిన ఆచారి అమెరికా యాత్ర, మనోజ్ చేసిన ఒక్కడు మిగిలాడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈ అన్నదమ్ములిద్దరూ కొన్నాళ్లు సినిమాలు పక్కనపెట్టారు.

భార్యాపిల్లలతో మంచువిష్ణు ప్రస్తుతం యూరోప్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అటు మంచు మనోజ్ సోలోగా మరికొన్ని దేశాలు చుట్టేసే పనిలో బిజీగా ఉన్నాడు. మళ్లీ ఈ హీరోలంతా ఎప్పుడు ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకొస్తారనేది ఇప్పట్లో తేలే అంశంకాదు.