మనవాళ్లు కాస్త మంచి క్యారెక్టర్ వుంటే చాలు తమిళం వైపు, మలయాళం వైపు చూస్తుంటారు. దాంతో వాళ్లు కొండెక్కి కూర్చుని, గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటారు. మనవాళ్లు ఆ భాషల్లో కూడా కాస్త మార్కెట్ వుంటుంది కదా అని లెక్కలు కట్టుకుని ఓకె అంటుంటారు.
మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు మోహన్ లాల్. అలా అని మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ వుంటే అడిగితే మాత్రం రేట్లు, కండిషన్లు ఓ రేంజ్ లో వుంటున్నాయట. డైరక్టర్ పవన్ సాధినేని హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లకు కలిపి ఓ కథ తయారుచేసారు. హరికృష్ణ కానీ బాలకృష్ణ కానీ చేస్తే ఆ క్యారెక్టర్ బాగుంటుందని ఆలోచన. కానీ బాలయ్య చేసే పరిస్థితిలేదు.
ఇక మిగిలింది సీనియర్ హీరోలు నాగ్, వెంకీ. వాళ్లు కూడా బిజీగా వున్నారు. పోనీ మోహన్ లాల్ ను ట్రయ్ చేద్దామంటే, భారీ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా తమిళ, మలయాళ డబ్బింగ్ రైట్స్ కూడా ఇచ్చేయాలని అడిగాడట. దాంతో గప్ చుప్ గా ఊరుకున్నారు. వెంకీ, నాగ్ ఫ్రీ అయితే కథ చెప్పి, ట్రయ్ చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇలా ప్రయత్నాల్లో దాదాపు ఏణ్ణర్థం నుంచి వుంది.