తొలి సినిమాతోనే లిప్ టు లిప్ కిస్ సీన్ చేసేసింది అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్. 'ధడక్' సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే, జాన్వీకపూర్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. 'తొలి సినిమానే కాబట్టి, ఈ సినిమా ఫలితం గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రశంసలకు ఉప్పొంగిపోవడంలేదు. విమర్శలకు నీరుగారిపోవడంలేదు. వీటన్నిటి గురించీ అమ్మ శ్రీదేవి నాకు ముందే చెప్పింది..' అంటూ జాన్వీ కపూర్ తన మనసులో మాట బయటపెట్టింది.
నెక్స్‌ట్ చేయబోయే సినిమా ఏంటన్నదానిపై జాన్వీకపూర్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదట. తనవరకూ అయితే, మాంఛి కమర్షియల్ సినిమా చేయాలని వుందంటోంది జాన్వీకపూర్. కమర్షియల్ సినిమా అంటే, బబ్లీగా.. స్టయిలిష్‌గా కన్పించే పాత్ర చేయాలన్నది తన ఆలోచన అని జాన్వీ అభిప్రాయపడింది. అదే సమయంలో, ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టపడ్తాననీ.. అవీ – ఇవీ బ్యాలెన్స్ చేసుకోవాలని అమ్మ తనకు సూచించేదని జాన్వీ ఒకింత భావోద్వేగానికి లోనయ్యింది.
ఎక్స్‌పోజింగ్ అంటే 'చూపించడం' మాత్రమేనన్న అభిప్రాయం అందరిలోనూ వుందనీ, ఎక్స్‌పోజింగ్ పేరుతో వల్గారిటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెబుతోన్న జాన్వీకపూర్, సినిమా లెక్కలు చాలా మారిపోయాయి గనుక, ఆ లెక్కలకు తగ్గట్టుగా, తన హద్దుల్లో తాను వుంటూ, అవసరమైన మేర అందాల ప్రదర్శనకు వెనుకడగు వేయబోనని క్లారిటీ ఇచ్చేసింది. టూ పీస్ బికినీతో ఎక్స్‌పోజింగ్ చేయొచ్చు.. దాంతోనే గ్లామరస్‌గా కన్పించొచ్చు.. నా ఓటు రెండోదానికే.. అంటూ జాన్వీ కాస్త తెలివిగా సమాధానమిచ్చింది.
అప్పుడే సినిమా గ్రామర్‌ని జాన్వీ బాగా వంటపట్టించేసుకున్నట్లు కన్పిస్తోంది కదూ.! ఇదిలా వుంటే, కుమార్తె జాన్వీకపూర్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట బోనీకపూర్. అయితే, అది జాన్వీకపూర్ రెండో సినిమా అవుతుందా.? లేదా.? అన్నదానిపై బోనీకపూర్ కూడా స్పష్టతనివ్వడంలేదు.