ఆ సినిమాకు డేట్ లాక్

శర్వానంద్-సాయి పల్లవి కాంబినేషన్ లో హను రాఘవపూడి డైరక్షన్ లో తయారవుతున్న సినిమా పడి పడి లేచె మనసు. ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారైన కథ ఇది. కలకత్తాలో లెంగ్తీ షెడ్యూలు పూర్తి…

శర్వానంద్-సాయి పల్లవి కాంబినేషన్ లో హను రాఘవపూడి డైరక్షన్ లో తయారవుతున్న సినిమా పడి పడి లేచె మనసు. ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారైన కథ ఇది. కలకత్తాలో లెంగ్తీ షెడ్యూలు పూర్తి చేసుకుని వచ్చింది యూనిట్. మరి కొన్ని సిన్లు లోకల్ గా చిత్రీకరిస్తున్నారు. మరో విదేశీ షెడ్యూలు బకాయి. ఇది అయిపోతే సినిమా వర్క్ పూర్తయిపోయినట్లే.

దాదాపు మేకింగ్ లో వున్న ప్రతి సినిమా డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాకు కూడా డేట్ ఫిక్స్ చేసేసారు. డిసెంబర్ మూడోవారం అయిన 21న పడి పడి లేచె మనసు సినిమా విడుదల అవుతుంది. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

సాయి పల్లవి క్రేజ్, మహానుభావుడు తరువాత శర్వానంద్ సినిమా ఇదే కావడంతో, పడి పడి లేచె మనసు సినిమా మీద కాస్త మంచి అంచనాలే వున్నాయి. పైగా డైరక్టర్ హను రాఘవపూడి యాక్షన్ కంటెంట్ జోలికి పోకుండా ప్యూర్ లవ్ స్టోరీ చేయడం కూడా విశేషమే.