@నర్తనశాల సీడెడ్ పంచాయతీ

సినిమాకు అందులోనూ కాస్త మీడియం సినిమాకు మాంచి బజ్ వస్తే ఇలాగే వుంటుంది. ఛలో సినిమా అలా అలా చిన్నగా వచ్చి పెద్ద హిట్ అయింది. మళ్లీ అదే బ్యానర్, అదే హీరో, అదే…

సినిమాకు అందులోనూ కాస్త మీడియం సినిమాకు మాంచి బజ్ వస్తే ఇలాగే వుంటుంది. ఛలో సినిమా అలా అలా చిన్నగా వచ్చి పెద్ద హిట్ అయింది. మళ్లీ అదే బ్యానర్, అదే హీరో, అదే మ్యూజిక్ డైరక్టర్ కాంబినేషన్ లో వస్తున్న @నర్తనశాలకు ఇది బాగా ప్లస్ అయింది. పైగా చైతన్య, నాని ఇలాంటి వాళ్ల సినిమాలు మూడున్నర కోట్లు, నాలుగు కోట్లు చెబుతారు సీడెడ్ ఏరియాకు. దాంతో కాస్త రీజనబుల్ బయ్యర్లకు కొనడం కష్టం. 

అలాంటి వారికి కోటికి అటు ఇటుగా వచ్చే ఇలాంటి సినిమాలు క్రేజీగా వుంటాయి. ఛలో సినిమా 60 లక్షలకు సీడెడ్ అమ్మారు. ఇప్పుడు @నర్తనశాల సినిమా నాకు కావాలంటే నాకు అంటూ ఇద్దరు బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఈ పోటీ కారణంగా 90లక్షల దగ్గర ప్రారంభమైన బేరం కోటి పదిలక్షలు దాటేసింది. పైగా దీనికోసం ఇద్దరు బయ్యర్లను కూర్చోపెట్టి వాళ్లలో వాళ్లనే డిసైడ్ చేసుకోమని చెప్పేయాల్సి వచ్చింది.

అయినా కూడా రేటు అయితే ఫిక్స్ అయింది కానీ ఎవరు బయ్యర్ అన్నది తేలలేదు. ఛలో రేట్లో చూసుకంటే @నర్తనశాల ప్రతిచోటా డబుల్ రేటు పలకడం విశేషం. ఓవర్ సీస్ ను తెలుగు ఫిల్మ్ నగర్ సంస్థ తీసుకుంది. రేటు, టెర్మ్స్ తెలియాల్సి వుంది.