విక్రమ్ కుమార్-బన్నీ సినిమా క్యాన్సిల్ ?

టాలీవుడ్ లో ఓ లేటెస్ట్ గాసిప్ గుప్పుమంటోంది. విక్రమ్ కుమార్- బన్నీ సినిమా వుండకపోవచ్చన్నది ఆ గ్యాసిప్. విక్రమ్ కుమార్ ఓ లైన్ ను బన్నీకి వినిపించాడని, ఆయన ఓకె చేసాడని, దాన్ని ఫుల్…

టాలీవుడ్ లో ఓ లేటెస్ట్ గాసిప్ గుప్పుమంటోంది. విక్రమ్ కుమార్- బన్నీ సినిమా వుండకపోవచ్చన్నది ఆ గ్యాసిప్. విక్రమ్ కుమార్ ఓ లైన్ ను బన్నీకి వినిపించాడని, ఆయన ఓకె చేసాడని, దాన్ని ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ గా మార్చడానికి వర్క్ చేస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అదే సమయంలో ఈ స్క్రిప్ట్ సెకండాఫ్ విషయంలో ఇంకా పూర్తి సంతృప్తి రాలేదని, కిందామీదా అవుతోందని కూడా వార్తలు వినిపించాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్నది ఏమిటంటే, అసలు ఆ లైన్, ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టారని, వేరే లైన్ ను విక్రమ్ కుమార్ ట్రయ్ చేస్తున్నాడనీ. చూస్తుంటే బన్నీ విక్రమ్ కుమార్ సినిమాను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ నవంబర్ నుంచి ఫ్రీ అవుతారు. ఆయన స్క్రిప్ట్ చేయడానికి కనీసం ఆరునెలలు పడుతుంది. ఈలోగా వేరే సినిమా ఏదయినా చేసే ఆలోచనలో బన్నీ వున్నారు. 

పైగా అసలు ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నది బన్నీ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. క్లాస్ టచ్ తో చేయాలా? పక్కా మాస్ సినిమా చేయాలా? అన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నారని వినికిడి. విక్రమ్ కుమార్ మంచి సినిమాలు అందిస్తారు కానీ కమర్షియల్ బ్లాక్ బస్టర్లు అయితే కావు. 

పైగా విక్రమ్ కుమార్ సినిమాను ఆరునెలల్లో తీయడం అన్నది సాధ్యంకాదు. పైగా స్క్రిప్ట్ రెడీకాలేదు. అందుకే వేరే ఆప్షన్లను బన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ యూత్ ఫుల్ డైరక్టర్ తో కూడా సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఏమైనా మొత్తంమీద బన్నీ కెరీర్ కాస్త ఒడిదుడుకుల్లోనే వుంది. ఒక సినిమా పడితే అన్నీ సెట్ అయిపోతాయి. కానీ ఆ సినిమా పడడమే కనిపించడంలేదు.