విజయ్ దేవరకొండ పాట పాడేసాడు

విజయ్ దేవరకొండ ఇప్పడు యంగ్ సంచలనం. ఎవ్వరు ఏమనుకుంటే నాకేం.. నా స్టయిల్ నాది అన్నట్లు దూసుకుపోతున్నాడు. అతగాడి లేటెస్ట్ సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో తన తప్పులేకున్నా, హీరోయిన్ ముందు దోషిగా…

విజయ్ దేవరకొండ ఇప్పడు యంగ్ సంచలనం. ఎవ్వరు ఏమనుకుంటే నాకేం.. నా స్టయిల్ నాది అన్నట్లు దూసుకుపోతున్నాడు. అతగాడి లేటెస్ట్ సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో తన తప్పులేకున్నా, హీరోయిన్ ముందు దోషిగా తరచూ నిలబడాల్సి వచ్చే పాత్రను చేస్తున్నాడు. 

ఆగస్టు 15న విడుదలవుతున్న గీత గోవిందంలో మరో స్పెషాల్టీ ఏమిటంటే, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఓ పాట పాడేయడం. విజయ్ దేవరకొండ పాడిన పాటను ఈరోజు విడుదల చేస్తారు. ఆర్టినరీగా అనిపించిన గీత గోవిందం సినిమా ఫస్ట్ లుక్ తో టర్న్ తీసుకుంది. హీరో తాను వర్జిన్ అనడం, లుంగీ కట్టుకుని, హీరోయిన్ ను భుజాల మీద మోయడం వంటి యూత్ ఫుల్ స్టిల్స్ సినిమాకు బజ్ తెచ్చాయి. 

అలాంటి టైమ్ లో కమల్ హాసన్ మన్మథలీల లాంటి టీజర్ ను కట్ చేసి వదిలారు. అది కూడా ప్లస్ అయింది. మరి ఇప్పడు హీరో స్వయంగా పాడిన పాట వదుల్తున్నారు. మరి ఇదెంత బజ్ జోడిస్తుందో చూడాలి. మొత్తంమీద సరిగ్గా మూడువారాల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి, చాలా స్మూత్ గా, ప్లాన్డ్ గా సినిమాకు బజ్ తీసుకువస్తున్నారు గీతగోవిందం నిర్మాతలు.