బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు హీరోయిన్లను భలేగా సెట్ చేస్తారు వెనుక దన్నుగా వున్న తండ్రి బెల్లంకొండ సురేష్. ఫస్ట్ సినిమాకే సమంతను హీరోయిన్ గా, తమన్నాను ఐటమ్ గర్ల్ గా తీసుకువచ్చారు. జయజానకీ నాయక సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను ఒప్పించారు. సాక్ష్యం సినిమా కోసం పూజాహెగ్డే. తేజ డైరక్షన్ లోని సినిమా కోసం కాజల్ ను తీసుకున్నారు.
ఈ సినిమా కన్నా ముందు కొత్త డైరక్టర్ తో చేయబోయే సినిమాలో ఒక హీరోయిన్ కాజల్ ను తీసుకున్నారు. అదే సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుందని వినికిడి. ఇప్పుడు ఈ పాత్ర కోసం ఈ మధ్య సెన్సేషనల్ హిట్ ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను అడుగుతున్నారని తెలుస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో కాజల్ ను తీసుకోక తప్పలేదు. మొదటి సినిమా హీరో ఛాయిస్ రెండో సినిమా డైరక్టర్ తేజ ఛాయిస్. అందుకే పాయల్ రాజ్ ఫుత్ ను కూడా తీసుకుంటే కాస్త డిఫరెంట్ గా వుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాయల్ ను చాలామంది కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఆమె ఇంకా ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. ఒకటి రెండురోజులు దాటితే క్లారిటీ రావచ్చు.