ప్రభాస్ కోసం పూజాహెగ్డే?

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత నడుస్తోంది. కాస్త క్లిక్ అయిన హీరోయిన్ దొరికితే ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు పూజాహెగ్డే టైమ్ అలా వుంది. డిజె సినిమా తరువాత ఆమె దశ తిరిగిందనే చెప్పాలి. రంగస్థలంలో…

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత నడుస్తోంది. కాస్త క్లిక్ అయిన హీరోయిన్ దొరికితే ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు పూజాహెగ్డే టైమ్ అలా వుంది. డిజె సినిమా తరువాత ఆమె దశ తిరిగిందనే చెప్పాలి. రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ జిగేల్ మని మెరిసింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమా చేసింది. ఎన్టీఆర్ తో అరవింద సమేత చేస్తోంది. 

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులోకి ఆమెను తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు వినిపిస్తోంది. సాహో సినిమా తరువాత బాహుబలి ప్రభాస్ చేయబోయే సినిమాకు హీరోయిన్ గా ఆమెను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకుడు.

పూజాహెగ్డేకు ఈ మేరకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. హీరోయిన్ కు కథ చెప్పడం, ఆమె ఓకె అన్నది జస్ట్ ఫార్మాలిటీ అన్నది తెలిసిందే. హీరో, డైరక్టర్ ఓకె అనుకుంటే ఫిక్సయిపోయినట్లే. ఒకటి రెండురోజులు వెయిట్ చేస్తే, ఏ సంగతీ తేలిపోతుంది.