సుకుమార్ సూపరెహె..

లోకల్ టాలెంట్ ను పసిగట్టాలి..అవకాశం ఇవ్వాలి. వాడుకోవాలి. వాళ్లకు ఉపయోగపడాలి తప్ప, ప్రీగా వాడేసుకోకూడదు. గతంలో ఉత్తరాంధ్రలో దిమిలి పొడుగు మనిషి అంటే ఫేమస్ తెలుగునాట తొలి ప్రయివేటు రికార్డులకు ఆద్యుడు ఆయన. ఈతరానికి…

లోకల్ టాలెంట్ ను పసిగట్టాలి..అవకాశం ఇవ్వాలి. వాడుకోవాలి. వాళ్లకు ఉపయోగపడాలి తప్ప, ప్రీగా వాడేసుకోకూడదు. గతంలో ఉత్తరాంధ్రలో దిమిలి పొడుగు మనిషి అంటే ఫేమస్ తెలుగునాట తొలి ప్రయివేటు రికార్డులకు ఆద్యుడు ఆయన. ఈతరానికి తెలియకపోవచ్చు. అలాంటి వ్యక్తి పాటలను మన సినిమా జనాలు ఫ్రీగా వాడేసుకున్నారు. నీ జీను ఫ్యాంటు చూసి బాబయా..అన్నది ఆయన పాటే. అలాగే ఎందుకే రమణమ్మా..పెళ్లెందుకే రమణమ్మా పాటకు స్ఫూరి ఇదే దిమిలి పొడుగు మనిషి రికార్డునే. కనీసం ఆయన పేరు కూడా టైటిల్ కార్టులో థాంక్స్ గా వేసిన గుర్తులేదు.

ఇదిలా వుంటే ఉత్తరాంధ్రలో ఇటీవల కాస్త పామర జనాల్లో, పల్లెల్లో ఫేమస్ అయిన పేరు గంటా వెంకటలక్ష్మీ. టిపికల్ స్వరం ఆమెది. గోదావరి జిల్లాకు చెందిన సుకుమార్ ఆమె స్వరం విని తన రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి పాట పాడే అవకాశం ఇచ్చారు. సూపర్ హిట్ అయింది.

కానీ మధ్యవర్తులు డబ్బులు తినేసి, పాపం, ఆ వెంకటలక్ష్మికి రూపాయి ఇవ్వలేదు. ఈ విషయం లోకల్ మీడియాలో బయటకు వచ్చింది. అలా అలా సుకుమార్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఏకంగా లక్ష రూపాయలు ఆమెకు పంపారట. ఓ పాటకు రెమ్యూనిరేషన్ కాదు. ఓ లోకల్ టాలెంట్ కు గుర్తింపు. ఇలా లోకల్ టాలెంట్, ఉత్తరాంధ్ర ఏరియావి, ఒరిస్సా ఫోకల్ సాంగ్ లు కొట్టేసిన వాళ్లు, సుకుమార్ పెద్ద మనసు చూసి సిగ్గు తెచ్చుకోవాలి.