‘శైలజ’ ప్లానింగే ప్లానింగ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూట్ ఈ రోజుతో పూర్తయిపోయింది. ఒక్కపాట మినహా మొత్తం ఫినిష్ చేసాడు దర్శకుడు మారుతి. పైగా అనుకున్న షెడ్యూలుకు రెండురోజులు ముందుగా…

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూట్ ఈ రోజుతో పూర్తయిపోయింది. ఒక్కపాట మినహా మొత్తం ఫినిష్ చేసాడు దర్శకుడు మారుతి. పైగా అనుకున్న షెడ్యూలుకు రెండురోజులు ముందుగా పూర్తిచేయడం విశేషం. ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే, మధ్యలో రెండునెలలు వృధా అయింది సవ్యసాచి షెడ్యూళ్ల కారణంగా,. లేదూ అంటే, చైతన్య ఎకాఎకి డేట్ లు ఇచ్చివుంటే, మే చివరకు రెడీ అయిపోయి వుండేది. రమ్యకృష్ణ, చైతన్య లాంటి మొత్తం స్టార్ కాస్ట్ తో హెవీ సీన్లతో సహా అన్నీ సింగిల్ షెడ్యూల్ లో డే అండ్ నైట్ లో ఫినిష్ చేయడం విశేషం. అదే సమయంలో డబ్బింగ్, ఎడిటింగ్ ఫినిష్ చేయించేసారు.

పది కోట్లకు పైగా లాభం..
ఇదిలా వుంటే హారిక హాసిని (సితార ఎంటర్ టైన్ మెంట్స్ మాతృసంస్థ)కి శైలజా రెడ్డి అల్లుడు మాంచి లాభాలు పండిస్తున్నాడు. దాదాపు 35కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు ఈ సినిమాను. శాటిలైట్, డిజిటల్, థియేటర్ రైట్స్ అన్నీకలిపి. థియేటర్ రైట్స్ తోనే నిర్మాణ వ్యయం వచ్చేసింది. సినిమా ఖర్చు యూనిట్ చెబుతున్నదాని ప్రకారం 22 నుంచి 23కోట్లు. అది కూడా పబ్లిసిటీతో కలిపి. అంటే దాదాపు పది పన్నెండు కోట్లు లాభం అన్నమాట.

ఇంత ప్రాఫిటబుల్ వెంచర్ లో దర్శకుడు మారుతి రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు అని వినికిడి. పదిహేను, ఇరవైకోట్లు తీసుకుంటున్న దర్శకులు కూడా ఇంత టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇవ్వడంలేదు. శైలజా రెడ్డి అల్లుడు కనుక బాక్సాఫీస్ దగ్గర ఫ్రూవ్ చేసుకుంటే మారుతి డిమాండ్ ఇంకా పెరుగుతుందేమో? బ్యాక్ టు బ్యాక్ 3 హిట్ లతో వున్నాడు ఆయన.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు థియేటర్లలోకి వస్తాడు.