నిర్మాత అయిన కొత్తల్లో కొత్త ఆలోచనలని ఎంకరేజ్ చేసిన దిల్ రాజు మరపురాని చిత్రాలని అందించాడు. ఆర్య, బొమ్మరిల్లు లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో తెలుగు సినిమా ఒరవడి మార్చాడు. నిర్మాతగా లాభాలు చవిచూసిన తర్వాత దిల్ రాజు సేఫ్ ప్లే స్టార్ట్ చేసాడు. రిస్క్ ఫ్యాక్టర్ వుందనిపించే కథలకి దూరంగా వుంటున్నాడు.
కమర్షియల్ ఫార్ములాని మాత్రమే నమ్ముకుంటూ, మంచి సీజన్లో తన సినిమాలు వచ్చేలా చూసుకుంటున్నాడు. ప్యాకేజింగ్ బాగా చేసి అమ్మేయడం వల్ల చాలా చిత్రాలు ఓపెనింగ్స్‌తో గట్టెక్కేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకి ఎవరైనా కొత్త కథ చెబితే దిల్ రాజుకి నచ్చడం లేదట. ఒక సినిమా విజయాన్ని ముందుగానే అంచనా వేసే దిల్ రాజు 'ఫిదా'కి అయితే లాస్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయాడట.
అంతగా తన జడ్జిమెంట్ పోవడంతో కొత్త ఆలోచనలని, క్రియేటివిటీని దిల్ రాజు అణచి వేస్తున్నాడని, దీంతో అతనితో ఒప్పందాలు చేసుకున్న దర్శకులు అతనికి నచ్చే విధంగా కమర్షియల్ కథలే రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తన బ్యానర్లోనే వరుసగా పని చేస్తోన్న దర్శకుల్లో కొందరు కొత్తగా చేద్దామని చెబితే వారితో దిల్ రాజు విబేధించాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఒకవైపు తెలుగు సినిమా కొత్త ఆలోచనలతో పురోగతి దిశగా వెళుతోంటే దిల్ రాజు లాంటి సీనియర్ రొటీన్ ఫార్ములా అంటూ బిగిసిపోవడం విచిత్రమే.