సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విజయ్

టాలీవుడ్ క్రేజీ యూత్ ఐకాన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు అగ్రెసివ్ పాత్రలు చేస్తున్న విజయ్ దేవరకొండ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఈ మేరకు ఓ ప్రాజెక్టు…

టాలీవుడ్ క్రేజీ యూత్ ఐకాన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు అగ్రెసివ్ పాత్రలు చేస్తున్న విజయ్ దేవరకొండ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఈ మేరకు ఓ ప్రాజెక్టు ఫైనల్ అయినట్లు బోగట్టా. నిర్మాత కెఎస్ రామారావుకు ఓ సినిమా చేయాల్సి వుంది. అదే ప్రాజెక్టుగా మారుతోంది.

గతంలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించారు క్రాంతి మాధవ్. ఆ తరువాత సునీల్ తో కామెడీ సినిమా ఉంగరాల రాంబాబు చేసి దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ తన ట్రాక్ లో పడి, తయారుచేసిన సబ్జెక్ట్ తోనే విజయ్ సినిమా చేయబోతున్నారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు బ్యానర్ లోనే ఈసినిమా కూడా చేయబోతున్నారు.

ఇటీవల తేజ్ ఐలవ్ యూ సినిమా అందించారు కేఎస్ రామారావు. అది ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అందుకే వీలయింనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ మీదకు వెళ్లాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం విజయ్ రెండు సినిమాల షూట్ ను ఫినిష్ చేయాల్సి వుంది. ఆ తరువాతే ఈ ప్రాజెక్టు వుండే అవకాశం వుంది.