విల్లాలు బాబూ..విల్లాలు

ఇప్పుడు డైరక్టర్ల దృష్టి అంతా విల్లాల మీదే. మంచి హిట్ పడితే, భారీ పారితోషికాలు వస్తాయి. దాంతో అపార్ట్ మెంట్ లైఫ్ కు స్వస్తి చెప్పి, విల్లాలకు షిప్ట్ కావడం అన్నది డైరక్టర్ల తరువాత…

ఇప్పుడు డైరక్టర్ల దృష్టి అంతా విల్లాల మీదే. మంచి హిట్ పడితే, భారీ పారితోషికాలు వస్తాయి. దాంతో అపార్ట్ మెంట్ లైఫ్ కు స్వస్తి చెప్పి, విల్లాలకు షిప్ట్ కావడం అన్నది డైరక్టర్ల తరువాత టార్గెట్ అయింది. వీలయితే ఇండిపెండెంట్ హవుస్ లేదూ అంటే విల్లా. 

దర్శకుడిగా ఓ హిట్ కొట్టిన తరువాత అడ్వాన్స్ లు వస్తాయి. అప్పుడు ఫస్ట్ టార్గెట్ అపార్ట్ మెంట్. మలి హిట్ కొట్టాక రెమ్యూనిరేషన్ పెరుగుతుంది. బ్లాక్ బస్టర్ పడితే ఇక చెప్పక్కరలేదు. అప్పుడు టార్గెట్ విల్లా. 

అపార్ట్ మెంట్ ల్లో వుండే బోయపాటి, పరుశురామ్ ఎప్పుడో విల్లాలకు షిఫ్ట్ అయిపోయారు. దర్శకుడు మారుతి 12 కోట్లతో మాంచి విల్లా కొన్నారు. అది ఇంటీరియర్ జరుగుతోంది. 

సుకుమార్ కూడా మాంచి విల్లా కొన్నారు. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి కూడా విల్లా ఓనర్ అయిపోయారు. ఆయన 12 కోట్లతో మాంచి విల్లా కొన్నారని తెలుస్తోంది.

దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?