సూరి సినిమా.. బన్నీతోనా? మహేష్ తోనా?

ధృవ సినిమాతో మెగాస్టార్ మనసు గెలుచుకుని, ఆ క్యాంప్ లో ఫిక్సయిపోయాడు డైరక్టర్ సురేందర్ రెడ్డి. సైరా లాంటి భారీ ప్రాజెక్టు చేతిలోకి వచ్చింది. ఆ సినిమా మరో ఆరేడు నెలల్లో ఒక కొలిక్కి…

ధృవ సినిమాతో మెగాస్టార్ మనసు గెలుచుకుని, ఆ క్యాంప్ లో ఫిక్సయిపోయాడు డైరక్టర్ సురేందర్ రెడ్డి. సైరా లాంటి భారీ ప్రాజెక్టు చేతిలోకి వచ్చింది. ఆ సినిమా మరో ఆరేడు నెలల్లో ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అయితే తరువాత ఏంటీ అన్నది పాయింట్. ఎందుకంటే ఇటీవల బన్నీ తరువాత సినిమాల జాబితాలో సురేందర్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది.

విక్రమ్ కుమార్ తరువాత సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ సినిమాలు వుంటాయని బన్నీ క్యాంప్ నుంచే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు వేరుగా వున్నాయి. సురేందర్ రెడ్డి తన తరువాత సినిమా బన్నీతో చేయకపోవచ్చన్నది ఆ గుసగుసల సారాంశం.

సురేందర్ రెడ్డి ఓ మాంచి లైన్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం సిద్దంచేసి వుంచాడని, మరోసారి మహేష్ తో తన లక్ ప్లస్ టాలెంట్ పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం 25వ సినిమా షూటింగ్ లో వున్న మహేష్ కాస్త ఫ్రీ కాగానే వెళ్లి లైన్ చెప్పే ఆలోచనలో సురేందర్ రెడ్డి వున్నట్లు తెలుస్తోంది.

అదేకనుక జరిగితే, ‘మనం సినిమా చేస్తున్నాం’ అని వన్ సైడ్ గా చెప్పేసి, విదేశాలకు వెళ్లిన బన్నీ జాబితాలోంచి ఓ పేరు జారిపోయినట్లు అవుతుంది. వాస్తావానికి బన్నీ క్యాంప్ అంటే డైరక్టర్లు కాస్త దూరంగా వుంటున్నారని వినికిడి. అక్కడికి వెళ్తే స్క్రిప్ట్ ఓ పట్టాన ఓకేకాదని, రోజులు తరబడి అక్కడే నలిగి, నలిగి, ఆఖరికి పూర్తి చేయాలని టాక్ వుంది.

బహుశా గతంలో ఇలాంటి అనుభవాలతోనే నేమో, సురేందర్ ఇప్పుడు మహేష్ బాబు వైపు మొగ్గుతున్నాడు?