సింగపూర్ లో మోక్షజ్ఞ?

నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు ఎక్కడ వున్నారు. కొన్నివారాల క్రిందటి వరకు తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ కు మిత్రులతో వచ్చి, కాస్సేపు కూర్చుని వెళ్లిన మోక్షజ్ఞ ఇప్పుడు రావడంలేదని తెలుస్తోంది. విశ్వసనీయ…

నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు ఎక్కడ వున్నారు. కొన్నివారాల క్రిందటి వరకు తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ కు మిత్రులతో వచ్చి, కాస్సేపు కూర్చుని వెళ్లిన మోక్షజ్ఞ ఇప్పుడు రావడంలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మోక్షజ్ఞను తండ్రి బాలయ్య సింగపూర్ కు పంపించినట్లు తెలుస్తోంది.

అక్కడ అనేక విద్యలు నేర్చుకోవడానికి పంపించారని టాక్. అయితే అన్నింటికన్నా ఇప్పుడు మోక్షజ్ఞకు కీలకమైనది ఫిట్ నెస్. వివిధ కారణాల వల్ల మోక్షజ్ఞ ఫిజిక్ కాస్త లావుగా తయారయిందని చూసిన వారి సమాచారం. అందుకే ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ సంతరించుకునేందుకు, అదే సమయంలో వివిధ సినిమాటిక్ విద్యలు నేర్చుకునేందుకు మోక్షజ్ఞను సింగపూర్ పంపించారని తెలుస్తోంది.

మూడునెలల్లో రెడీ అవ్వగలిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞనే పెట్టేద్దామని క్రిష్ సూచించారు. మరి ఆ మాటల ప్రభావం కావచ్చు, లేదా కొడుకును వారసుడిగా లైన్లో పెట్టాలనే ఆలోచన కావచ్చు, మొత్తంమీద ఇప్పుడు సింగపూర్ పంపించినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడునెలల్లో మాంచి ఫిట్ నెస్ తో మోక్షజ్ఞ మళ్లీ ఫిలింనగర్ ప్రాంతంలో కనిపిస్తాడేమో?