మొత్తానికి అంతా రెడీ అయింది. అనేకానేక అడ్డంకులు తొలగిపోయాక ఇప్పుడు బండి లైన్ లో పడింది. క్రిష్ వచ్చి మొత్తం అంతా సెట్ రైట్ చేసారు. ఇప్పుడు సెట్ మీదకు కూడా వెళ్లిపోతోంది. ఈనెల 5 నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నిర్విరామంగా షూట్ వుంటుంది. బాలయ్యకు రాజకీయ అనివార్య పనులు వుంటే తప్ప, లేదూ అంటే షూటింగ్ మీదే వుంటారు.
షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ అనేది ఇవాళ ఫైనల్ అవుతుంది. గ్రీన్ మ్యాట్ సీన్లు వుంటాయి కాబట్టి, ఇప్పటికిప్పుడు సెట్ అవసరంలేదు. అన్నపూర్ణ, ఆర్ఎఫ్సీ రెండూ డిస్కషన్ లో వున్నాయి. అన్నపూర్ణలోనే షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.
శర్వానంద్ లేనట్లేనా?
ఎన్టీఆర్ యంగ్ క్యారెక్టర్ కు శర్వానంద్ ను తీసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే అది లేనట్లే అని తెలుస్తోంది. డిజిటల్ కరెక్షన్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాలయ్యనే చూపించాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.
అదే విధంగా నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే కళ్యాణ్ రామ్ ను తీసుకోవాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. మిగిలిన వారిని ఎవ్వరిని తీసుకుంటారో లేదో క్లారిటీలేదు. హరికృష్ణను వేరే ఏదైనా క్యారెక్టర్లో చూపించే ఆలోచన అయితే వున్నట్లు తెలుస్తోంది.