తరుణ్ భాస్కర్ కు ఏమైంది ?

సినిమా బాగుంటే తమ గొప్ప,  బాగాలేదూ అంటే సమీక్షకులకు చూడడం చాత కాలేదు అనే వాళ్ల జాబితాలో డైరక్టర్ తరుణ్ భాస్కర్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. Advertisement వాస్తవానికి తరుణ్ భాస్కర్ ఫేస్ బుక్,…

సినిమా బాగుంటే తమ గొప్ప,  బాగాలేదూ అంటే సమీక్షకులకు చూడడం చాత కాలేదు అనే వాళ్ల జాబితాలో డైరక్టర్ తరుణ్ భాస్కర్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది.

వాస్తవానికి తరుణ్ భాస్కర్ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి ఎక్కువగా వాడడు. మరి తరుణ్ భాస్కర్ పిక్ తో, అతను పెట్టినట్లుగానే ఓ ట్విట్టర్ పోస్ట్ చలామణీలోకి వచ్చింది.

అదెలా వుంది అంటే…'' ఏదో ఒక రోజు సినిమా సమీక్షల మీద సమీక్ష రాస్తానేమో? సమీక్షలు రాసే వాళ్లంతా దారుణమైన అర్హత లేని జనాలు. కనీసం సినిమా అప్రియేషన్ కోర్సు లాంటిది చేసిన వారు మాత్రమే సమీక్షలు రాస్తే బాగుంటుందేమో? సమీక్షలు రాసేవారికి స్క్రీన్ ప్లే రైటింగ్, ఇతర విషయాల మీద అవగాహన శూన్యం. జస్ట్ ఔత్సాహికులు మాత్రమే…'' అన్నది సారాశం.

ఇది నిజంగా తరుణ్ భాస్కర్ నే చేసి వుంటే, అంతకన్నా దారుణం మరోటి వుండదు. గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాగే మాట్లాడాడు. ఎలాంటి సినిమాలు తీసి వదిలాడు, ఎక్కడ వున్నారు అన్నది అందరికీ తెలిసిందే.

ఇదే తరుణ్ భాస్కర్ తన తొలి సినిమా పెళ్లి చూపులు రెడీ అయ్యాక రోజుల తరబడి నిత్యం రామానాయుడు స్టూడియోలో షో ల మీద షో లు వేసి, సమీక్షలు రాసే జనాలను పిలిచి పిలిచి చూపించారు. సినిమా విడుదలకు ముందుగా సోషల్ మీడియాలో ఆ జనాలే ఆ సినిమాను పల్లకీ మోసినట్లు మోసారు. 

ఇప్పుడు ఆ జనాలే తరుణ్ భాస్కర్ కు అన్ క్వాలిఫైడ్ గా కనిపిస్తున్నారు. తన సినిమా తనకు ముద్దే కావచ్చు. తప్పులేదు. కానీ ఇంకెవరు అందులో లోపాలు ఎంచకూడదు అని అనడం, ఎంచితే వాళ్లకు ఏం తెలుసు అనడం భలే చిత్రమైన వాదన.

గతంలో మాదిరి సోషల్ మీడియాలో అందరు సమీక్షకులు తన సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారని తరుణ్ భాస్కర్ అనుకుని వుండొచ్చు. అది జరగకపోవడంతో, ఇలాంటి స్టేట్ మెంట్ లు బయటకు వస్తున్నాయేమో?