సావిత్రిగా మళ్లీ కీర్తి సురేష్

కీర్తి సురేష్ కు అదృష్టం పట్టినట్లు వుంది. మహానటి సినిమాలో సావిత్రిగా నటించి, ఒకేసారి పాతిక సినిమాలు చేసిన క్రేజ్, పేరు సంపాదించింది. ఈతరం హీరోయిన్లు డబ్బు సంపాదిస్తూ వుండొచ్చు కానీ, కీర్తి సాధించిన…

కీర్తి సురేష్ కు అదృష్టం పట్టినట్లు వుంది. మహానటి సినిమాలో సావిత్రిగా నటించి, ఒకేసారి పాతిక సినిమాలు చేసిన క్రేజ్, పేరు సంపాదించింది. ఈతరం హీరోయిన్లు డబ్బు సంపాదిస్తూ వుండొచ్చు కానీ, కీర్తి సాధించిన పేరు ఎవ్వరూ సాధించలేదు. ఇది వాస్తవం. ఈ సినిమా తరువాత ప్రెస్టీజియస్ పాత్రలు కీర్తిని వెదుక్కుంటూ వస్తున్నాయి. అన్నింటికన్నా విశేషం ఏమిటంటే, మళ్లీ మరోసారి సావిత్రి కీర్తి సురేష్ నటించబోతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా బాలయ్య-క్రిష్ కాంబినేషన్ లో తయారు కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ అంటే సావిత్రి, నాగేశ్వరరావులు లేకుండా వుంటారా? అందులోనూ ఆ రెండు పాత్రల నిడివి కూడా కాస్త ఎక్కువే. అందుకే ఈసారి నాగేశ్వరరావు క్యారెక్టర్ కు హీరో సుమంత్ ను తీసుకున్నారు. చెప్పాలంటే నాగ్ చైతన్య తో సినిమా క్రేజ్ రావచ్చు కానీ, సుమంత్ కు నాగేశ్వరరావు పోలికలు ఎక్కువ వున్నాయి. అలాగే సావిత్రి క్యారెక్టర్ కు కీర్తి సురేష్ ను తీసుకున్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రకు, సావిత్రి పాత్రకు మధ్య కీలక సన్నివేశాలు వున్నాయట. అందుకోసమే కీర్తి సురేష్ ను ప్రత్యేకంగా తీసుకున్నారు. మొత్తం మీద ఓ మహానటి పాత్రను రెండు బయోపిక్ ల్లోతానే పోషించే అవకాశం వెదుక్కుంటూ రావడం కీర్తి సురేష్ అదృష్టమే.