సంజయ్ దత్, మాధురీ దీక్షిత్.. బాలీవుడ్ అమరప్రేమికుల్లో వీళ్లదీ ఒక ప్రముఖమైన జంట. పెళ్లి పీటలు ఎక్కని ప్రేమ కథ. ప్రేమలో మునిగి తేలి, తర్వాత ఎవరికి వారు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయిన బ్రేకప్ జంటగా వీరు బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు, మీడియాకూ గుర్తుండిపోతారు. ఇప్పటికీ వీళ్ల ప్రేమకథ హాట్ టాపిక్కే. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారు. దీంతో మీడియా వీళ్ల పాతకథను గుర్తు చేస్తోంది. దశాబ్దాల తర్వాత మాధురితో కలిసి నటించబోతుండటం ఏమనిస్తోంది అని ఈ మధ్య మీడియా వాళ్లు దత్‌ను డైరెక్టుగా అడిగేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేని దత్ అక్కడ నుంచి కోపం నిష్క్రమించాడు.
మాధురీ ప్రస్తావన దత్ కు కోపాన్ని తెప్పించింది. మాధురీ ప్రస్తావన కన్నా మాధురీతో ప్రేమను గుర్తు చేయడం ఈ హీరోకి కోపం తెప్పించింది. అందుకేనేమో దత్ బయోపిక్‌లో కూడా మాధురీ ఊసే లేదు.
ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ ప్రస్తావన ఉంటుందా? అని విడుదలకు ముందు రోజు కూడా రణ్‌బీర్ తో కొంతమంది ఆరా తీశారు. అది సినిమా చూసి తెలుసుకోండి అని ఆ హీరో చెప్పాడు. తీరా చూస్తే.. సినిమాలో మాధురి ఊసే లేదు. దత్ ప్రేమ వ్యహారాలు, రాసలీలలను ఒకే మాటతో తేల్చేశారు. టీనేజ్ ప్రేమకథను చూపించారు. అంతేకానీ.. హీరోయిన్‌లతో ఈ హీరో వ్యవహరాలను సినిమాలో చూపించనే లేదు. బహుశా దత్ మాజీ ప్రేయసులు అంతా ఇప్పుడు సెటిలైపోయి ఉంటారు. మాధురీ కూడా పెళ్లై పిల్లలతో ఉంది. ఇక పాతకథను బయోపిక్ లో తవ్వడం ఎందుకన్నట్టుగా ఆ ప్రస్తావనలేవీ లేకుండా చేశారు.