బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా వెల్ ప్లాన్డ్ గా చకచకా వెళ్లిపోతోంది. టాకీ పూర్తి కావచ్చింది. కీలకమైన ఎమోషన్ సీన్లు బకాయి వున్నాయి. ఈలోగా పాటల పని పూర్తి చేసే పనిలోకి దిగుతోంది. జూలై ఫస్ట్ వీక్ లో యూరప్, జార్జియా వెళ్లి రెండు పాటలు ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు లోకేషన్ల రెక్కీ పూర్తి చేసారు.
ఈ లోగా టాకీ ప్యాచప్ పనులు కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. పాటల షూట్ నుంచి తిరిగి వచ్చాక, సినిమాలో కీలకంగా భావించి పక్కన పెట్టిన ఎమోషన్ సీన్లు చకాచకా షూట్ చేసేసారు. దాదాపు అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. నవంబర్ నుంచి రామ్ చరణ్ కు అస్సలు ఈ సినిమా మీద వర్క్ లేకుండా చేయాల్సి వుంది. ఎందుకంటే ఆ తరువాత రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు మీదకు వెళ్లిపోవాల్సి వుంది.
అందుకే ఎక్కడా ప్లానింగ్ గాడి తప్పకుండా చూసుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా వర్క్ చేస్తూనే బోయపాటి తన తరువాతి బాలయ్య ప్రాజెక్టు స్క్రిప్ట్ ల పని కూడా చేసేస్తుండడం విశేషం.