అరవింద సమేత ఆంధ్ర @ 40 కోట్లు

2018 సెకండాఫ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ ఏదయినా వుందీ అంటే అది, త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమానే. Advertisement మహానటి సినిమా తరువాత నుంచి ఇప్పటి…

2018 సెకండాఫ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ ఏదయినా వుందీ అంటే అది, త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమానే.

మహానటి సినిమా తరువాత నుంచి ఇప్పటి వరకు క్రేజీ ప్రాజెక్టు ఒక్కటి తెరమీదకు రాలేదు. దసరాలోపు మరో క్రేజీ ప్రాజెక్టు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. అందుకే అరవింద సమేత సినిమాకు మాంచి బిజినెస్ క్రేజ్ వచ్చింది.

ఈ రోజు మూడు ఏరియాలు ఫ్యాన్సీ రేట్లకు క్లోజ్ చేసారు. ఆంధ్రను 40 కోట్ల రేషియోలో ఫిక్స్ చేసారు. ముందుగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు ఆ రేషియోలో క్లోజ్ చేసారు. ఈస్ట్ ను వి 3 సంస్థ 6.40కి తీసుకుంది. వెస్ట్ ను ఎల్విఆర్ సంస్థ 5.55 కోట్లకు తీసుకుంది. నెల్లూరును భాస్కర రెడ్డి 3.15 కు తీసుకున్నారు.

పెద్ద హీరోల సినిమాలు ఆంధ్ర 40 కోట్ల రేషియో అన్నది కామన్ అయిపోయింది. పవన్, మహేష్, ఎన్టీఆర్ సినిమాలన్నీ ఈ రేషియోలోనే అవుతున్నాయి. కానీ రామ్ చరణ్ రంగస్థలం మాత్రం ఆ రేషియోలో కాలేదు. అందుకే చాలా ఏరియాలు నిర్మాతలే వుంచుకున్నారు. ఇక మీదట రామ్ చరణ్ కూడా ఈ నలభై కోట్ల రేషియోలోకే వస్తాడు. 

ఆంధ్ర నలభై కోట్ల రేషియో అంటే నైజాం 20 కోట్లు దాటేస్తుంది. సీడెడ్ 12 కోట్లు దాటుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల బిజినెస్ నే 70 నుంచి 72 కోట్ల వరకు వుంటుంది. ఇక కర్ణాటక, తమిళనాట, అదర్స్, ఓవర్ సీస్ అన్నీ కలిపి వంద కోట్లకు చేరిపోతుంది.