ఒకప్పుడు హీరోల డేట్ ల కోసం కిందా మీదా అయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎవరి దగ్గర డైరక్టర్ల డేట్ లు వుంటే హీరోలు ఆ నిర్మాతల దగ్గరకు వస్తున్నారు. కొరటాల శివ, బోయపాటి, రాజమౌళి డేట్ లు వుండబట్టే, మహేష్, చరణ్, ఎన్టీఆర్ వరుసపెట్టి డివివి దానయ్యతో సినిమా చేస్తున్నారు.
హారిక హాసిని త్రివిక్రమ్ ను తోడు చేసుకోవడంతోనే అన్ని సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందుకే మైత్రీ, యువి లాంటి సంస్థలు కనిపించిన డైరక్టర్ ను కనిపించినట్లు లాక్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ వుంది. ఫ్లాపులు, డిజాస్టర్లు ఇచ్చిన డైరక్టరను ఎవ్వరూ పట్టించుకోరు. అది వేరే సంగతి.
లేటెస్ట్ గా సమ్మోహనం హిట్ ఇచ్చిన ఇంద్రగంటిని నిర్మాత దిల్ రాజు లాక్ చేసేసారట. సమ్మోహనం ముందు ఇంద్రగంటిని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదనే చెప్పాలి. జెంటిల్ మన్ తీసిన నిర్మాత శివప్రసాద్ నే మళ్లీ సమ్మోహనం తీసారు.
సమ్మోహనం తరువాత ఇంద్రగంటి మీద అందరి దృష్టి పడింది. జనాలు ఆయన దగ్గరకు వెళ్లే లోగానే దిల్ రాజు లాక్ చేసేసారు. డైరక్టర్ , కథ వుంటే, దిల్ రాజుకు ఏ హీరో అయినా డేట్లు ఆనందంగా ఇచ్చేస్తారు.