ఆంధ్రలో రాను రాను బాక్సఫీస్ స్పాన్ పెరుగుతొంది. థాంక్స్ టు సురేష్ బాబు, దిల్ రాజు, యువి వంశీ. ఎందుకంటే ఎక్కడక్కడ మూత పడిన థియేటర్లు తీసుకుని, అలాగే పాత లుక్ లో వున్న థియేటర్లు తీసుకుని కొత్తగా మల్టీప్లెక్స్ హంగులు అందిస్తున్నారు. దాంతో జనాలు థియేటర్ కు రావడం పెరిగింది. దీంతో కలెక్షన్లు బాగా పెరిగాయి. పెద్ద సినిమాలకు వైజాగ్ ఏరియా నైజాం కు దగ్గరగా పలుకుతోంది. అయితే అంత మాత్రం చేత అన్ని సినిమాలకు ఆ అవకాశం లేదు. ఇప్పటి వరకు ఆంధ్రలో ఎన్టీఆర్ కు నలభై కోట్ల రేంజ్ రాలేదు.
ఆంధ్ర ఏరియాను నలభై కోట్ల రేంజ్ లో అమ్మడం అన్నది మహేష్ బాబు, పవన్ సినిమాలకే సాధ్యమైంది. రంగస్థలం టైమ్ లో 35 రేషియోలో అమ్మడం కూడా కష్టం అయింది. ఆఖరికి ఈస్ట్, కృష్ణా నిర్మాతలే వుంచుకోవాల్సి వచ్చింది. కానీ సినిమా విడుదల తరువాత ఓ రేంజ్ లో వచ్చాయి కలెక్షన్లు. అందుకే బోయపాటి-రామ్ చరణ్ సినిమాకు అంత రేటు పలికింది.
భరత్ అనే నేను సినిమా 40 కోట్ల రేషియోలో అమ్మారు కానీ, ఆంధ్ర అంతటా ఆ రేషియోలో కలెక్షన్లు రాలేదు. ఈస్ట్ లో మాత్రం 40 కోట్ల రేషియోలు కలెక్షన్లు వచ్చాయి.
లేటెస్ట్ గా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను ఆంధ్రలో 40 కోట్ల రేంజ్ లో అమ్మే ప్రయత్నం ప్రారంభమైంది. మూడు ఏరియాలు ఈ రేంజ్ లో విక్రయించారు. అందులో ఒకటి నిర్మాణ సంస్థ హారిక హాసినితో సంబంధం వున్న వి 3 సంస్థనే. ఈ సంస్థ ఈస్ట్ గోదావరి హక్కులు తీసుకుంది. ఏమయినా ఈస్ట్, వెస్ట్, నెల్లూరు ఏరియాలకు నలభై కోట్ల రేషియోలో విక్రయించడం అంటే చాలా పెద్ద ఫీట్ కిందే లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు ఆ ఫీట్ లేదు.
ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయనకు కూడా ఇప్పటి వరకు ఆంధ్రలో నలభై కోట్ల ఫీట్ లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ..ఆ ఏదీ లేదు. అజ్ఞాతవాసి మాత్రమే ఈ రేంజ్ అమ్మకాలు చేసారు. కానీ వసూళ్లు రాలేదు.
……ఎన్టీఆర్ సినిమాలు…
అరవింత సమేత..ఈస్ట్..6.40…వెస్ట్..5.55..నెల్లూరు..3.15
జై లవకుశ… ఈస్ట్..5.57…..వెస్ట్..3.70..నెల్లూరు..2.54
జనతా గ్యారేజ్…ఈస్ట్..4.95 వెస్ట్…..4.30..నెల్లూరు..2.35
నాన్నకు ప్రేమతో…ఈస్ట్…3.12.వెస్ట్….2.50..నెల్లూరు..1.57
ఇప్పుడు అరవింద సమేత కనుక ఆంధ్రలో 40 కోట్ల ఫీట్ సాధిస్తే, అది ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది ఇటు ఎన్టీఆర్ కు అటు త్రివిక్రమ్ కు.