టాలీవుడ్ లో దేనికి తేడా వచ్చినా ఫరవాలేదు కానీ మాట తేడా రాకూడదు. నాలుగ్గోడల నడుమ ఎలా వున్నా ఫరవాలేదు కానీ, నలుగురిలో మాత్రం అత్యంత వినయంగా వుండాల్సిందే. అది మెగాస్టార్ అయినా సరే, అప్ కమింగ్ స్టార్ అయినా సరే. కానీ పాపం, చాలా మంది అది తెలియక, తమ చిత్తానికి మాట్లాడేసి, అభాసు అవుతుంటారు.
లేటెస్ట్ గా ఓ చిన్న నటుడి గురించి ఇండస్ట్రీలో కాస్త గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న నటుడిగా వుంటూ, ఇండస్ట్రీలో చాలా అంటే చాలా కింద నుంచి స్టార్ట్ చేసి, మెల్లగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఇప్పుడు ప్రయివేటు సంభాషణల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు టాక్ మొదలైంది. అతగాడి సోలో సినిమా ఒకటి రాబోతోంది.
'ఇక చూడండి..టాలీవుడ్ కు కాబోయే మెగాస్టార్ ను నేనే అంటూ, తనకు సన్నిహితులైన వారిని, ' ఇంక మీరు పని చేయక్కరలేదు. నేనే చూసుకుంటూ మిమ్మల్ని అందర్నీ. కోట్లు వస్తాయి మనకి' అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడట. పైగా పబ్లిక్ ఫంక్షన్ లో కూడా కాస్త తేడాగా మాట్లాడేసరికి, ఇప్పుడు ఇండస్టీ ఇన్ సైడ్ సర్కిళ్లలో అంతా ఇతగాడి మాటల గురించే డిస్కషన్ జరుగుతోంది.
సినిమా తేడా వస్తే పరిస్థితి ఏమిటి అని కొందరు. సన్నబడడం కోసం అన్నం మానేసి, వేరే విధమైన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, మానసికంగా ప్రభావం చూపించి ఇలా మాట్లాడిస్తోందని కొందరు, ఇక మీద ఇండస్ట్రీలో చాన్స్ లు దొరుకుతాయా? అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.