చానాళ్ల తరువాత మాధవన్ మళ్లీ తెలుగు జనాలకు దగ్గరవుతున్నాడు. సవ్యసాచి సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో మాధవన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా విడుదల కాకుండానే మరో సినిమా కూడా మాధవన్ చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మాధవన్ కీలకపాత్రలో నటించే ఓ సిన్మా కు ప్లానింగ్ జరుగుతోంది. రచయిత, నిర్మాత కోన వెంకట్ తన కె ఎఫ్ సి బ్యానర్ మీద, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ తో కలిసి ఓ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసారు. ప్లానింగ్ దశలో వున్న ఈ సినిమాలో మాధవన్ దే కీలకపాత్ర.
కోన వెంకట్ చెప్పిన లైన్ కు మాధవన్ ఓకె చేసి ప్రాజెక్టులో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. అప్పుడే సినిమాకు డైరక్టర్ ఎవరు, మిగిలినవి ఫైనల్ చేస్తారు.