ప్రభాస్ సినిమా కథ యేలేటి ఇచ్చిందా?

సాహో సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా ఎప్పుడో ఫిక్సయిపోయింది. జిల్ సినిమా సినిమా డైరక్టర్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ యూరప్ నేపథ్యంలో జరిగే ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ చేయబోతున్నారు.…

సాహో సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా ఎప్పుడో ఫిక్సయిపోయింది. జిల్ సినిమా సినిమా డైరక్టర్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ యూరప్ నేపథ్యంలో జరిగే ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ చేయబోతున్నారు. ఆ సినిమాలో అస్ట్రాలజీ తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపిస్తాడు. ఈ విషయాలన్నీ ఇప్పటికే బయటకు వచ్చాయి. 

అయితే ఈ కథకు మూలాధారం ఓ హాలీవుడ్ సినిమా అని వినిపిస్తోంది. ఆ సినిమా ఆధారంగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఓ కథ అల్లుకున్నారని వినికిడి. అయితే ఆ లైనుతో సినిమా చేద్దామని యేలేటి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదని, ఈ సంగతి తెలిసిన రాధాకృష్ణ తనకు ఇవ్వమని అడిగి తీసుకున్నారని బోగట్టా.

ఆ విధంగా హాలీవుడ్ సినిమా ఇన్సిపిరేషన్ లో యేలేటి అల్లిన కథ, రాధాకృష్ణ చేతిలో పడి, స్క్రిప్ట్ గా మారి, త్వరలో ప్రభాస్ సినిమాగా మన ముందుకు రాబోతున్నదన్నమాట.