గోపీచంద్-బ్యాక్ టు సేఫ్ జోనర్

ఏ హీరోను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో, అలాగే చేయాలి. కష్టమైనా, ఇష్టమైనా తప్పదు. కాస్త పక్కకు జరగాలని వున్నా, దానికి చాలా నేర్పు కావాలి. గోపీచంద్ మొదటి నుంచీ మాస్ సినిమాలే అటెంప్ట్ చేస్తూ…

ఏ హీరోను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో, అలాగే చేయాలి. కష్టమైనా, ఇష్టమైనా తప్పదు. కాస్త పక్కకు జరగాలని వున్నా, దానికి చాలా నేర్పు కావాలి. గోపీచంద్ మొదటి నుంచీ మాస్ సినిమాలే అటెంప్ట్ చేస్తూ వచ్చారు. లౌక్యం దగ్గర కాస్త మంచి ట్రాక్ పడింది. కానీ మళ్లీ అదే రూట్ లో వెళ్దామన్నా, ఇంకాస్త డిఫరెంట్ గా చేయాలన్నా సెట్ కాలేదు. దాంతో పరాజయాలు ఎదురయ్యాయి.

దీంతో ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఫ్యామిలీ, ఫన్, మాస్ యాక్షన్ జోనర్ లోనే సినిమా చేస్తున్నాడు. ఈ రోజు విడుదలయిన పంతం ట్రయిలర్ ఆ సంగతి చెప్పకనే చెప్పింది. కొత్త దర్శకుడు చక్రి పూర్తిగా సేఫ్ జోన్ లో కథ, కథనాలు తయారుచేసుకుని, ఏ ఒక్క పేయింగ్ ఎలిమెంట్ మిస్ కాకుండా చూసుకున్నట్లు కనిపిస్తోంది.

రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్ లో విడుదలవుతోంది. ట్రయిలర్ తో తన ట్రాక్ లోకి వచ్చానని చెప్పిన గోపీచంద్ ఈ సినిమా హిట్ అయితే కెరీర్ కూడా ట్రాక్ లోకి వచ్చింది అనిపించేసుకుంటాడు. బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు సినిమాలు వున్నాయి గోపీచంద్ చేతిలో. అందువల్ల ఈ సినిమా హిట్ కావడం మాత్రమే ఆలస్యం.