ప్రభాస్ పీరియాడిక్ ప్రేమకథ

ఇప్పుడు నడుస్తున్నది పీరియాడిక్ సినిమాల టైమ్. రంగస్థలం దగ్గర నుంచి మొదలయింది. 1980 బ్యాక్ డ్రాప్ లో తీయడం. నాని కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేస్తున్న జెర్సీ సినిమా కూడా…

ఇప్పుడు నడుస్తున్నది పీరియాడిక్ సినిమాల టైమ్. రంగస్థలం దగ్గర నుంచి మొదలయింది. 1980 బ్యాక్ డ్రాప్ లో తీయడం. నాని కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేస్తున్న జెర్సీ సినిమా కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నదే. ఇంకా మరి కొన్ని సినిమాలు కూడా ఇదే తరహావి ప్రిపేర్ అవుతున్నాయి.

అందులో కీలకమైనది బాహుబలి ప్రభాస్ చేయబోయే ప్రేమకథ సినిమా. జిల్ డైరక్టర్ రాధాకృష్ణ డైరక్షన్ లో సాహో తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా అదే. ఈ సినిమా కూడా పీరియాడిక్ సినిమానే అని తెలుస్తోంది. 1970 దశకంలో నడిచే కథ అని వినికిడి. 

సినిమా మొత్తం ఇటలీ లో జరుగుతుంది. దాదాపు షూటింగ్ అంతా ఇటలీలోనే వుంటుంది. పైగా 1970 నేపథ్యంలో జరిగే ప్రేమకథ. అంటే టోటల్ గా కాస్త ఆసక్తికరమైన సంగతే. ఈ సినిమాకు బడ్జెట్ కూడా వంద కోట్ల వరకు వుంటుందని తెలుస్తోంది.