వైఎస్ హయాంలో కేవిపి ఏ రేంజ్ లో తెరవెనుక చక్రం తిప్పారో అందరికీ తెలిసిందే. ఆ తరువాత కూడా ఆయన చాణక్యం అలాగే సాగుతోందని అప్పుడూ, అప్పుడూ వార్తలు అందుతూనే వున్నాయి.
ఇటు కేంధ్రంలోనూ, ఇటు తెలంగాణలోనూ ఆయన మాట చెల్లుబడి అవుతూనే వుందని, తెరవెనుక ఆయనే అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారని వినిపిస్తూనే వుంది.
ఇప్పుడు మళ్లీ మరోసారి కేవిపి పేరు వినిపిస్తోంది. హైదరాబాద్ లోని కీలక కాంగ్రెస్ నేతల్లో ఒకరైన దానం నాగేందర్ తెరాస దిశగా అడుగులు వెయడం వెనుక కేవిపి మంత్రాంగం దాగి వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కేవిపి సలహా సూచనల మేరకే దానం నాగేందర్ తెరాస వైపు వెళ్లారని టాక్ వినిపిస్తోంది. దానం నాగేందర్ కు ఎంట్రీ ఇచ్చేందుకు కూడా కేసిఆర్ వైపు పావులు కదిపింది కూడా కేవిపినే అని వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో వుంటూనే, అన్ని పార్టీల్లో తన పట్టు కొనసాగించుకుంటూ, పైకి మాత్రం అస్సలు లైమ్ లైట్ లో కనిపించకుండా, తన చాణక్యం నెరపడంలో కేవిపి ని మెచ్చుకోవాలి.
మరి ఇంతకీ జగన్ కు దూరంగా వుంటూ కేవిపి అక్కడ ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారో? లేక మౌనంగా ఏం జరుగుతోందో అలా చూస్తున్నారో? జగన్ పక్కన కెవిపి వుంటే సీన్ వేరుగా వుండేదేమో?