ప్రియుడితో కలిసి ముంబైలో దిగిన హీరోయిన్!

తనకన్నా చాలా చిన్నవాడితో ప్రేమాయణాన్ని నడిపిస్తోందన్న ప్రచారాన్ని ఎదుర్కొంటున్న ప్రియాంక చోప్రా ఈ విషయంలో చాలా డేర్‌గా కనిపిస్తోంది. తాజాగా తన ప్రియుడైన కుర్రాడితో కలిసి ముంబైలో దిగింది ప్రియాంక. నిక్ జోనస్ అనే…

తనకన్నా చాలా చిన్నవాడితో ప్రేమాయణాన్ని నడిపిస్తోందన్న ప్రచారాన్ని ఎదుర్కొంటున్న ప్రియాంక చోప్రా ఈ విషయంలో చాలా డేర్‌గా కనిపిస్తోంది. తాజాగా తన ప్రియుడైన కుర్రాడితో కలిసి ముంబైలో దిగింది ప్రియాంక. నిక్ జోనస్ అనే అమెరికన్ కుర్రాడిని ప్రియాంక ఇండియాకు తీసుకొచ్చింది. ప్రియాంక, నిక్‌‌లు ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై ప్రియాంక అస్సలు స్పందించడం లేదు. అతడితో కలిసి మాత్రం తరచూ కనిపిస్తోంది. ఇటీవలే అమెరికాలో నిక్ సోదరుడి వివాహ ఫంక్షన్‌కు ప్రియాంక హాజరైంది. ఆ సమయంలో నిక్ తన కుటుంబీకులకు ప్రియాంకను పరిచయం చేశాడట. ఇప్పుడు ఆమె అతడిని ఇండియాకు తీసుకురావడాన్ని బట్టి చూస్తే.. వీళ్లిద్దరూ ఏదో సీరియస్ ప్లాన్స్‌లోనే ఉన్నారని స్పష్టం అవుతోంది.

తన కుటుంబీకులకు పరిచయం చేయడానికే నిక్‌ను ప్రియాంక ఇండియాకు తీసుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అతడిని పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారానికి కూడా ఇప్పుడు ఊపు వస్తోంది. అందుకోసమే వీరు పరస్పరం ఇళ్లలోని వారికి దగ్గరవుతున్నారని అంటున్నారు. అతడు ప్రియాంక కన్నా తొమ్మిది, పది సంవత్సరాల చిన్నవాడు. ప్రియాంక పక్కన నిలబడితే.. ఆమె ముదురు మొహం ముందు పిల్లాడిలా కనిపిస్తూ ఉన్నాడు. ఇతడిని ప్రియాంక పెళ్లి చేసుకుంటే.. చిన్నవాడిని పెళ్లి చేసుకున్న పలువురు హీరోయిన్ల జాబితాలో ప్రియాంక కూడా నిలుస్తుంది.