మహేష్ 25 : ఎవరు విజేత?

మహేష్ బాబు అమాయకంగా, అసలు విషయాలు దాచేసి, బ్రహ్మోత్సవం డిజాస్టర్ ను తప్పించేసుకుని, వేరే సినిమా చేసేసుకుని, మాంచి రెమ్యూనిరేషన్ అందుకుందామన్న ఆశలు అణగారిపోయాయి. Advertisement మహేష్ దిగివచ్చేలా చేసి, ఆఖరికి పివిపి తో సినిమాకు…

మహేష్ బాబు అమాయకంగా, అసలు విషయాలు దాచేసి, బ్రహ్మోత్సవం డిజాస్టర్ ను తప్పించేసుకుని, వేరే సినిమా చేసేసుకుని, మాంచి రెమ్యూనిరేషన్ అందుకుందామన్న ఆశలు అణగారిపోయాయి.

మహేష్ దిగివచ్చేలా చేసి, ఆఖరికి పివిపి తో సినిమాకు ఓకె చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో నిర్మాతలు కట్టుబానిసలు, ఇక్కడే వుంటారు. ఇక్కడే బతకాలి. అందువల్ల హీరోలను ఎదిరించలేరు. ఎదురు మాట్లాడలేరు అని అందరిలాగే మహేష్ కూడా భావించాడని అనుకోవాలి. కానీ వుంటే టాలీవుడ్ లో వుంటే, లేదంటే సినిమాలు మానేస్తా, అంతే కానీ లొంగేది లేదు అని, నిర్మాత పివిపి పోరాటం సాగించడంతో మహేష్ బాబు దిగిరాక తప్పలేదు.

ఇప్పుడు ఆ ఓటమిని కవర్ చేసుకోవడానికి మహేష్-నమ్రతలు తమ అనుకూల ఆర్టికల్స్ తయారీలో బిజీ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పందంలో మహేష్ పూర్తిగా జెంటిల్ మెన్ బిహేవియర్ కనబర్చాడని ఆర్టికల్స్ వండి వార్పిస్తున్నారు.

నిజానికి సింపుల్ లాజిక్ ఏమిటంటే, మహేష్ కు ఆ జెంటిల్ మన్ బిహేవియర్ వుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. రెండు కారణాలుగా పివిపి కి సినిమా చేయాలి.

ఒకటి రెండు సినిమాలు చేయాల్సిన అగ్రిమెంట్. రెండవది అరివీర భయంకరం డిజాస్టర్ బ్రహ్మోత్సవం. కానీ తెలివిగా వంశీ పైడిపల్లిని అటు జరిపి, తనకు సంబంధం లేదు సినిమా వివాదంలో అన్నట్లు క్రియేట్ చేసారు. కానీ పివిపి ఇంత వరకు లాగుతారు అనుకోలేదు.

నిజానికి మహేష్ డేట్ లు దిల్ రాజువి కావు. పివిపి వి. ఆయన ప్రాజెక్టులో ఇప్పుడు అశ్వనీదత్, దిల్ రాజు చేరినట్లు అయింది. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఓ విధంగా మహేష్ బాబు లాభం పొందారు. ఎలా అంటే, మూడు అగ్రిమెంట్ లు ఒకే సినిమాతో చెల్లుచేసారు. పూర్తి లాభాలు తినాల్సిన నిర్మాతలు పాపం వన్ థర్డ్ తో సరి పెట్టుకోవాలి ఇఫ్పుడు.

ఒక విధంగా మహేష్ కు నష్టం. ఎందుకంటే ఈ సినిమాకు మహేష్ పారితోషికం డ్రాస్టిక్ గా కట్ చేసారు. ముగ్గురు నిర్మాతలు కాబట్టి, లాభాలు రావాలి కాబట్టి, మహేష్ పారితోషికాన్ని బాగా అంటే బాగా కోసేయడానికి నమ్రత ఒకె అన్నారు. అలాగే ఇక లాభాల్లో కూడా వాటా లేదు.

ఈ డీల్ లో ఒక విధంగా విజయం పివిపి ది. కానీ ఆయనకు కాస్త నష్టమే. ఎందుకంటే సోలో సినిమా లేదు. పైగా కొంత మొత్తం వదులుకోవాల్సిన అగ్రిమెంట్ ఏదో వుందని తెలుస్తోంది. అయితే కోర్టు ఖర్చులు మాత్రం వదలుకొవడం లేదు.

ఇక ఈ డీల్ లో పూర్తిగా నష్టపోయేది దిల్ రాజు. టోటల్ చాకిరీ అంతా ఆయనదే. నిర్మాణ బాధ్యతలు, మార్కెటింగ్, ఇంకా అన్నీ పనులు ఆయనే చేయాలి. కానీ వాటా మాత్రం వన్ థర్డ్ నే. తరువాత మహేష్ సినిమా అన్నది ‘రేపు’ అని రాసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చిన కేఎల్ నారాయణ లాంటి వాళ్లు లైన్ లో వుండనే వున్నారు.

ఇప్పుడు చెప్పండి బాయ్స్..ఈ టోటల్ ఎపిసోడ్ లో జెంటిల్ మెన్ ఎవరు? విజేత ఎవరు?