నాగచైతన్య సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి రేటే పలుకుతోంది. సవ్యసాచికి మూడు కోట్లు పాతికలక్షలకు పైగా రేటు పలికింది. దాన్ని చూసి, మారుతి-చైతూ కాంబినేషన్ లోని ఓవర్ సీస్ రేటు మూడు కోట్లు పది లక్షలకు ఫైనల్ చేసేసారు. అగ్రిమెంట్ కాలేదు కానీ, మాటలు పూర్తయ్యాయి. ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డి ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను తీసుకుంటున్నారు.
నిజానికి ఓవర్ సీస్ లో చైతూ సినిమా హక్కులు మూడు కోట్లకు పైగా అంటే కాస్త సాహసించినట్లే లెక్క. అయితే మారుతి ట్రాక్ రికార్డు తోడవుతుందని, సేఫ్ అయిపోవచ్చని ఇలా తెగించినట్లు కనిపిస్తోంది.
ఇదిలా వుంటే అన్ని సినిమాలు కలిపి గంప గుత్తగా అమ్మాలని అనుకున్న హారిక హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కేవలం ఎన్టీఆర్ సినిమాను సెపరేట్ గా ఇచ్చేసారు. ఇప్పుడు మారుతి సినిమా ఓకె చేసారు.
ఇక సుధీర్ వర్మ-శర్వానంద్, ఈ రోజే ప్రకటించిన నాని సినిమాలు వున్నాయి. చూస్తుంటే ఓవర్ సీస్ లో మార్కెట్ వున్న హీరోలు, డైరక్టర్లతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలో అనౌన్స్ చేయబోయే నితిన్ సినిమాకు డైరక్టర్ వెంకీ కుడుముల. ఇతగాడి ఛలో కూడా ఓవర్ సీస్ లో బాగానే వెళ్లింది. అందువల్ల శర్వా, నాని, నితిన్ సినిమాలు కూడా మంచి రాబడే తెచ్చే అవకాశం వుంది హారిక హాసిని సంస్థకు.